మన సినిమాలలోకామెడీ పక్కదారి తొక్కుతోంది. వ్యక్తుల అవయవాలు, వారి లావు, పొట్టి, పొడవులపై కామెడీ పండించాలని చూస్తారు. సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా పొట్టిగా ఉండే సరికి బుడ్డోడు అంటూ ఉంటారు. ఇక కల్పనారాయ్, గీతాసింగ్, ఐరన్‌లెగ్ శాస్త్రి వంటి వారితో కూడా ఇదే రకమైన కామెడీని పండించేవారు. ఇక నాటి మీరాజాస్మిన్, నిత్యామీనన్ నుంచి అనుపమ పరమేశ్వరన్‌తోపాటు ఎందరినో పొట్టిగా ఉన్నారని ఎద్దేవా చేస్తూ ఉంటారు. ‘స్వయంవరం’ చిత్రంలో కూడా హీరోయిన్ లయ, వేణుని కరెంట్ స్థంభం అని వెక్కిరిస్తూ ఉంటుంది. ఇక పొట్టివీరయ్య వంటి మరగుజ్జులతో కూడా ఇలాంటి హాస్యాన్నే సృష్టించేవారు.
ఇక విషయానికి వస్తే తెలుగులో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి మాధవీలత. ఆమె సమాజంలోని పలు విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. ఈమె తాజాగా నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను పొట్టిగా ఉన్నానని వెక్కిరించే వారికి ఘాటుగా ఫేస్‌బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఇటీవల శ్రీనగర్‌కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొంది. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఈనేపథ్యంలో కొందరు నెటిజన్లు మాధవీలత ‘చాలా పొట్టి’ అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ విమర్శలకు స్పందించిన మాధవీలత మాట్లాడుతూ..శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నేను పాల్గొన్నాను. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశాను. అయితే చాలా మంది పొట్టిది పొట్టిది అని కామెంట్స్ పెట్టారు.
అవునురా బై...నేను పొట్టిగానే ఉంటాను. నీకేమైనా ఎక్కడైనా నొప్పి వచ్చిందా? నీకేమైనా మాయరోగం వచ్చిందా? నీకేమైనా పోయే కాలం వచ్చిందా? లేదు కదా...! మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి అందరు పొడవుగానే ఉన్నారుకదా..! ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది మీకు ఉన్నందుకు సంతోషించండి. నా మీద పడి ఎందుకు ఏడుస్తారు? నా పొట్టి వల్ల ఎవరికైనా నొప్పి వస్తే చెప్పండి. ఆ నొప్పికి ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోండి. లేకుంటే అది శాడిస్టిక్ రోగం అని భావించాల్సి వస్తుంది. వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకో.. ఫొటో, వీడియోలు పెడితే నచ్చితే నచ్చింది.. లేదంటే నచ్చలేదని చెప్పండి. నేను పొట్టి దాన్నే. నల్లగా ఉంటాను. అయితే నీకేంటి? ఇష్టం లేకపోతే నా పేజీ నుంచి వెళ్లిపో...! అని ఫేస్‌బుక్ లైవ్‌లో ఘాటుగా సమాధానం వచ్చింది.