Advertisementt

హిందీ ‘కాంచన’లో ఎవరో తెలుసా?

Wed 17th Oct 2018 10:28 PM
kanchana,remake,hindi,lawrence,akshay kumar  హిందీ ‘కాంచన’లో ఎవరో తెలుసా?
Akshay Kumar to reportedly star in Hindi remake of Kanchana హిందీ ‘కాంచన’లో ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

కొరియోగ్రాఫర్, యాక్టర్ అండ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముని’ సిరీస్ తమిళంలో...తెలుగులోనూ మంచి నేమ్‌ని సంపాదించుకుంది. లారెన్స్ నటన అయితే అద్భుతం అనేలా ఈ సిరీస్‌లను చూసి ప్రేక్షకులు చెప్పిన మాట. అయితే ఇందులో భాగంగా తెరకెక్కిన ‘కాంచన’ చిత్రం.. హిందీ‌లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇందులో హీరోగా బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ నటించనున్నాడు.

అక్షయ్ కుమార్ విభిన్నమైన కథలను ఎంచుకుని .. విలక్షణమైన పాత్రలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే అక్షయ్ ను ఈప్రాజెక్టు లో తీసుకున్నట్టు తెలుస్తుంది. హారర్ జోనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంను ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ కథనాలు ప్రకారం అక్కడ కూడా లారెన్సే ఈసినిమా డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం కథానాయిక ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. తమిళ .. తెలుగు భాషల్లో కాసుల వర్షం కురిపించిన ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Akshay Kumar to reportedly star in Hindi remake of Kanchana:

Akshay Kumar In Hindi Remake Of South Horror Film Kanchana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ