ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలు మధ్య విడుదలైన చిత్రం ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పలు రికార్డులను సాధిస్తూ..ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.
అయితే ఈ సినిమాపై స్పందించండి అంటూ నందమూరి ఫ్యాన్స్ మహేష్‌ను కోరుతున్నారు. ఎన్టీఆర్ - మహేష్ మధ్య మంచి అనుబంధం ఉందని అందరికి తెలిసిందే. గత కొంతకాలం నుండి మహేష్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ ముగ్గురు రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు అని అందరికి తెలిసిన విషయమే. ఈ ముగ్గురి మధ్య ఉన్న స్నేహంతో ఇండస్ట్రీలో మంచి వాతావరణం నెలకొంది. అందుకే రామ్ చరణ్ ‘అరవింద సమేత’ చిత్రం గురించి స్పందించి ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు.
మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అందుకే ‘అరవింద సమేత’ని ఇంకా చూడలేదని తెలుస్తుంది. లేట్ గా చూసిన స్పందించడం పక్కా అని అర్ధం అవుతుంది. ఎందుకంటే వీరి ముగ్గురి ఫ్రెండ్ షిప్ అటువంటిది. ఒకవేళ మహేష్ రియాక్ట్ అయితే కొంచెం డల్‌గా ఉన్న ఓవర్సీస్ కలెక్షన్స్ పెరిగే అవకాశముందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూద్దాం మరి మహేష్ ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతాడో..!