అల్లు అర్జున్ కి నా పేరు సూర్య దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా నెలలే పట్టేట్టుగా వుంది. నా పేరు సూర్య ప్లాప్ తో ఇంకా ఆలోచిస్తున్న అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలో అనేది ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్న అల్లు అర్జున్.. విక్రమ్ కుమార్ కథతో ఆయన డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని... సెకండ్ హాఫ్ కథని మార్చమని విక్రమ్ కి చెప్పిన విక్రమ్... అల్లు అర్జున్ కి కావాల్సినట్టుగా మార్చలేకపోవడంతోనే విక్రమ్ కుమార్ డైరెక్షన్ కి అల్లు అర్జున్ బై బై చెప్పాడని టాక్ నడుస్తుంది. ఇక అల్లు అర్జున్.. వి.ఐ. ఆనంద్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడని అన్నారు. అది కూడా ఉత్తిదే అని తేలిపోయింది. ఇక బన్నీ... త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడంటున్నారు. ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసిన త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి ప్లాప్ ఉండడంతో....అరవింద సమేత హిట్ అయితే బన్నీ... త్రివిక్రమ్ కి కమిట్ అవుతాడంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.
అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన అరవింద సమేత - వీర రాఘవ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక సినిమా హిట్ టాక్ రావడంతో.... అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని.. అరవింద హిట్ తో బన్నీ హ్యాపీ అంటూ కథనాలు మీడియాలో ప్రచారం అయ్యాయి. అయితే అరవింద సమేత సినిమాకి మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది. సినిమాలో చాలా లోపాలున్నాయి. త్రివిక్రమ్ కామెడీతో సినిమా చెయ్యకుండా ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ యాక్షన్ సినిమా చేశాడు. అలాగే ఈ సినిమాకి ఎన్టీఆర్ మెయిన్ పిల్లర్ గా కనబడుతున్నాడు కానీ.. త్రివిక్రమ్ డైరెక్షన్ ని పొగిడిన వారు లేరు. ఏదో క్రిటిక్స్ వేసిన హిట్ మార్కులు, దసరా సెలవులు, థియేటర్స్ లో రెండు వారాలనుండి మంచి సినిమా లేకపోవడంతో అరవింద సమేతకి కలిసొచ్చి సినిమా హిట్ అయ్యింది కానీ.. లేదంటే ఎన్టీఆర్ స్టామినా, త్రివిక్రమ్ మాటలు, ఏవి సినిమాని నిలబెట్టేవి కాదు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరవింద సమేత కలెక్షన్స్ చూసి త్రివిక్రమ్‌తో సినిమాకి కమిట్ అవుతాడా? లేదంటే అరవింద సమేత టాక్ తో డ్రాప్ అవుతాడా అనేది మాత్రం ప్రస్తుతం ఫుల్ సస్పెన్స్. త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ మీద నమ్మకమైతే ఉంది.. కానీ తనకి గట్టి ప్లాప్ తగలడంతో ధైర్యంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఆప్షన్ మారుతుందా? మళ్ళీ మరో దర్శకుడు అల్లు అర్జున్ లిస్ట్ లోకి చేరుతాడా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.