'మీటూ' ప్రకంపనలు ఇంకా ఉదృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌పై ఓ అజ్ఞాతమహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. మూడేళ్ల కిందట టి-సిరీస్‌లో మూడు సినిమాలకు తాను హీరోయిన్‌గా ఎన్నికైన క్రమంలో భూషణ్‌కుమార్ తనను ఓ రాత్రి గడిపి తన కోరికలు తీరిస్తే సూపర్‌స్టార్‌ని చేస్తానని ఆయన తన కోర్కెను భయటపెట్టాడని ఓ మహిళ ట్వీట్ ద్వారా తెలిపింది. అప్పటికి మూడు చిత్రాలకు గాను తనతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటామని హామీ ఇచ్చారని, తాను, భూషణ్ తొలిసారి కార్యాలయంలో కలిశామని, మరుసటి రోజే తాను మూడు సినిమాలలో హీరోయిన్‌గా నటించేందుకు అగ్రిమెంట్‌పై సంతకాలు జరగాల్సి ఉందని ఆమె తెలిపింది.
‘‘తర్వాతి రోజు ఉదయం భూషణ్ నుంచి సాయంత్రం తనని బంగళాలో కలవాలని మెసేజ్ వచ్చింది. దానికి నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. నాతో సంబంధం కొనసాగిస్తే సూపర్‌స్టార్‌ని చేస్తానని ప్రలోభ పెట్టాడు. సినిమా అవకాశాల కోసం తాను ఎవరితో గడపాల్సిన అవసరం లేదని అలా గడపాల్సివస్తే తాను సినిమా అవకాశాలనే వదులుకుంటానని ఆయనకు మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆయనని కలసినప్పుడు ఆయన అలాగే ఒత్తిడి తెస్తూ ఉండటంతో నేను నిరాకరించాను.
ఈ విషయం ఎవరికైనా చెబితే సిటీలో లేకుండా చేస్తానని, ప్రాణాలనైనా తీస్తానని ఆయన నన్ను బెదిరించాడు. భూషణ్‌తో నేను గడిపేందుకు అంగీకరించకపోవడంతో నన్ను ఆ మూడు సినిమాల నుంచి తొలగిస్తున్నట్లు టి-సిరీస్ ప్రతినిధులు చెప్పారు...’’ అని ఆ బాధిత మహిళ చెప్పుకొచ్చింది. దీనిపై భూషణ్ స్పందించాడు. నిరాధార ఆరోపణలు చేసిన మహిళపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించడం కొసమెరుపు.