వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న అంతరిక్షం 9000 KMPH టీజర్ అక్టోబర్ 17న విడుదల కానుంది. తెలుగు ఇండస్ట్రీలో తొలి స్పేస్ నేపథ్యం ఉన్న సినిమా ఇదే కావడం విశేషం. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్ లో అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. హీరో వరుణ్ తేజ్ తో పాటు పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అంతరిక్షం 9000 KMPH కోసం చాలా కష్టపడ్డారు.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి అంతరిక్షం సినిమాను నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న అంతరిక్షం 9000 KMPH విడుదల కానుంది.
నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
సాంకేతిక నిపుణులు: దర్శకుడు: సంకల్ప్ రెడ్డి, సమర్పకులు: క‌్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: క‌్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి, సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్, సినిమాటోగ్రఫర్: జ‌్ఞానశేఖర్ విఎస్, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, సంగీతం: ప‌్రశాంత్ విహారి, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ మరియు మోనిక, యాక్షన్ కొరియోగ్రఫర్: టాడర్ పెట్రోవ్ లాజారోవ్, సిజీ: రాజీవ్ రాజశేఖరన్, పిఆర్ఓ: వంశీ శేఖర్