Advertisementt

పవన్‌ డైలాగ్‌తో తారక్‌.. తారక్‌ మాటతో చరణ్!

Tue 16th Oct 2018 04:25 PM
jr ntr,aravinda sametha,success meet,pawan kalyan,dialogue  పవన్‌ డైలాగ్‌తో తారక్‌.. తారక్‌ మాటతో చరణ్!
Ram Charan Praises Aravinda Sametha Veera Raghava పవన్‌ డైలాగ్‌తో తారక్‌.. తారక్‌ మాటతో చరణ్!
Advertisement
Ads by CJ

పాతతరం హీరోల సంగతి పక్కన పెడితే నేటి తరం యంగ్‌స్టార్స్‌ మాత్రం తమ మధ్య కెరీర్‌పరంగా, అభిమానుల పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా ఒకరంటే ఒకరు ఎంతో స్నేహంతో వ్యవహరిస్తున్నారు. అందునా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో అభిమానులు, ప్రేక్షకులు 'తూర్పు-పడమర'గా 'ఉప్పు-నిప్పు'గా భావించే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు మల్టీస్టారర్‌ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అభిమానులను కూడా ఒకటి చేస్తుందనే ఆశ అందరిలో ఉంది. ఇక స్వతహాగా తారక్‌-ఎన్టీఆర్‌లు మంచి స్నేహితులు. వీరితో పాటు మహేష్‌బాబు కూడా వీరికి ఆప్తుడే. ఒకప్పుడు ఎన్టీఆర్‌-చిరంజీవి కూడా కలసి నటించారు. 

ఇక విషయానికి వస్తే త్రివిక్రమ్‌తో పవన్‌కళ్యాణ్‌కి ఎంతో అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు 'జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి' చిత్రాలు వచ్చాయి. ఇక త్రివిక్రమ్‌ అంటే మనసులోతుల్లోంచి జీవిత సారాన్ని చదివి మరీ సంభాషణలు రాస్తాడు. ఆ డైలాగ్స్‌ అందరు హీరోలను, అభిమానులను బేధాలు లేకుండా అలరిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు తమ ప్రసంగాలలో కూడా హీరోలు త్రివిక్రమ్‌ డైలాగ్‌లను తమ నోటి వెంట పలుకుతూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్‌ 'అరవింద సమేత వీరరాఘవ' విజయోత్సవ వేడుకలో పవన్‌ 'అత్తారింటికి దారేది' చిత్రం క్లైమాక్స్‌లో చెప్పే మాటల మాంత్రికుడి డైలాగ్‌ని పలికాడు. 'కంటికి కనిపించని శత్రువుతో... బయటకు కనపడని యుద్దం చేస్తున్నా' అంటూ తారక్‌ నోట పవన్‌ డైలాగ్‌ వచ్చింది. అదే సమయంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నోటి వెంట ఎన్టీఆర్‌ పేరు వచ్చింది. ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా 'అరవింద సమేత వీరరాఘవ'పై, తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 

ఆయన మాట్లాడుతూ, 'తన కెరీర్‌లో మరోసారి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన నటనతో అలరించాడు. బోల్డ్‌ స్టోరీ.. సూపర్బ్‌ డైరెక్షన్‌.. ఎంతో మంచి డైలాగ్‌లతో త్రివిక్రమ్‌ ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ నటన, జగపతిబాబు, తమన్‌ వంటి వారు ఈ చిత్రానికి పిల్లర్స్‌గా నిలిచారు. పూజాహెగ్డే నటనను ఎంతో ఎంజాయ్‌ చేశాను. 'అరవింద సమేత వీరరాఘవ' టీంకి నా శుభాకాంక్షలు.. అని పేర్కొన్నాడు. ఎలాంటి భేషజాలు లేకుండా తనతోటి స్టార్‌ని మెచ్చుకుని, ఆయన చిత్రాన్ని అభినందించిన చరణ్‌పై నెటిజన్లు ఆయన పెద్ద మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Ram Charan Praises Aravinda Sametha Veera Raghava:

Jr NTR Says pawan Kalyan Dialogue at Aravinda Sametha Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ