త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత మొదట్లో మిక్స్డ్ టాకొచ్చినా... తర్వాత హిట్ టాక్ వచ్చింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ నటనకు అందరికన్నా ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఎన్టీఆర్ నటన, క్లాసీ లుక్స్, సిక్స్ ప్యాక్ అన్నీ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఫ్యాక్షన్ కథతో సినిమా చేసినప్పటికీ త్రివిక్రమ్ డైరెక్షన్ స్కిల్స్ కూడా మెచ్చుకోదగినవే. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ కి అందరూ ఎప్పటిలాగే ఫిదా అవుతున్నారు. అయితే సినిమాకి మొదట్లో యావరేజ్ అండ్ మిక్స్డ్ టాక్ వచ్చి చివరికి హిట్ టాక్ రావడం మాత్రం కొంతమంది కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
మొదటినుండి చెప్పినట్లుగానే త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో పెద్దగా కనబడలేదనేది వాస్తవం. త్రివిక్రమ్ మార్క్ కామెడీ సినిమాలో మిస్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం వర్కౌట్ అయ్యింది. ఇక సినిమాలో త్రివిక్రమ్ ఫన్నీ కామెడీతో కలిసి యాక్షన్ పండిస్తే.. సినిమా ఇంకా సూపర్ గా ఉండేదని... కొంతమంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీ మిస్ అవడంపై ఆ సినిమాలో నీలాంబరిగా నటించిన సునీల్ మాట్లాడుతూ... ప్రేక్షకులకు దర్శకడు త్రివిక్రమ్ కామెడీని అలవాటు చేశారు కాబట్టి… అందరూ కామెడీ లేదని అంటున్నారు. ఇదే టీమ్‌తో మరో అగ్ర దర్శకుడు సినిమా చేస్తే… ఎవరూ కామెడీ లేదని కామెంట్ చేయరు. అసలెవరూ మాట్లాడరు. సూపర్‌గా ఉందంటారు.. అంటూ అరవింద సమేత - వీర రాఘవలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎందుకు లేదో క్లారిటీ ఇచ్చాడు.
మరి స్నేహితుడు త్రివిక్రమ్ ఈ అరవింద సమేతని కామెడీ లేకుండా ఎందుకు చేసాడో అనేది కవర్ చేసే ప్రయత్నం సునీల్ బాగా చేశాడంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఏదిఏమైనా అరవింద సమేత లో కామెడీ మిస్ అయితేనేమి... సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తున్నాయి.