Advertisementt

రామ్, విశాల్.. వీరరాఘవుడికి పోటీ ఎవరు?

Mon 15th Oct 2018 03:38 PM
pandem kodi 2,hello guru premakosame,aravinda sametha,ready to release  రామ్, విశాల్.. వీరరాఘవుడికి పోటీ ఎవరు?
Ram and Vishal Movies Ready to Release రామ్, విశాల్.. వీరరాఘవుడికి పోటీ ఎవరు?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ 'అరవింద సమేత' హవా నడుస్తుంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ ల జోరు కొనసాగిస్తున్న టైములో వచ్చే వారం రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో ఒకటి రామ్ - అనుపమ జంటగా నటించిన 'హలో గురు ప్రేమ కోసమే'. ఈసినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా విడుదల అయ్యాక ఏమైనా వండర్స్ క్రియేట్ చేస్తుందేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. రామ్ సినిమాలు చాలా వరకు సెలైంట్‌గా హిట్టయ్యాయి కాబట్టి.. ఈ సినిమా కూడా అలా సెలైంట్‌గా హిట్ అవ్వడం ఖాయం అనేలా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అదే రోజున తమిళ - తెలుగులో విశాల్ నటించిన 'పందెం కోడి 2' రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. 'పందెం కోడి'కి సీక్వెల్ గా వస్తున్న సినిమాలో విలన్ పాత్రలో విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్  నటిస్తుంది. కథ విషయం అంత కొత్తగా ఏమి ఉండకపోవచ్చని అంటున్నారు. ఇది రెగ్యులర్ కథే అని ఇందులో విశాల్ - వరలక్ష్మి మధ్య జరిగే మైండ్ గేమ్ తో కథ రసవత్తరంగా సాగుతుందని టాక్. సెకండ్ హాఫ్ లో వీరి సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా తమిళ నేటివిటీతో ఉండటం తెలుగులో కొంత మైనస్ అయ్యేలా ఉంది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. రామ్ సినిమాకి పోటీగా వస్తున్న.. ఈ సినిమా నిలబడుతుందా? లేదా.. రామ్ సినిమా నిలబడుతుందా? చూడాలి.

Ram and Vishal Movies Ready to Release:

Pandem Kodi 2 vs Hello Guru Premakosame

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ