Advertisementt

'మీటూ' నేనో మంచి విషయం చెప్తా: జాన్వీకపూర్!

Mon 15th Oct 2018 12:47 PM
janhvi kapoor,metoo,best thing,sridevi daughter  'మీటూ' నేనో మంచి విషయం చెప్తా: జాన్వీకపూర్!
Janhvi Kapoor reveals the best thing she has read about MeToo 'మీటూ' నేనో మంచి విషయం చెప్తా: జాన్వీకపూర్!
Advertisement
Ads by CJ

దేశంలో పలువురు సంప్రదాయ వాదులు మహిళలకు దుస్తులు, ప్రవర్తన విషయంలో కూడా మార్పు తెచ్చుకోవాలని కోరుతున్నారు. కేవలం చిన్న చిన్న దుస్తుల్లో ఎక్స్‌పోజింగ్‌ చేయడం, ఇతరులను రెచ్చగొట్టే వస్త్రధారణ, పబ్బులు, క్లబ్‌లంటూ తిరగడం మన సాంప్రదాయం కాదంటున్నారు. కానీ వీటిని మహిళా అభ్యుదయకారులతో పాటు ఎందరో ఖండిస్తున్నారు. స్త్రీలు తమ ఇష్టం వచ్చిన దుస్తులు, తిండి, జీవన విధానం, అలవాట్లు వారి స్వేచ్ఛ అని, దీనిపై ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయవద్దని నొక్కి వక్కాణిస్తున్నారు. 

ఇక తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ మాత్రం దీనికి విరుద్దంగా మాట్లాడింది. మగాళ్ల అలవాట్లు, వారి వేషధారనే దీనికి కారణమని కొత్త యాంగిల్‌ మాట్లాడుతూ వచ్చింది. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న 'మీటూ' ఉద్యమం గురించి నేనో మంచి విషయం విన్నాను. తమ పట్ల అనవసరంగా నిందలు వేస్తున్నారని అనుకునే మగాళ్లు బయటికి వచ్చి పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. బార్లకు వెళ్లడం, తాగడం, ఒంటరిగా అర్ధరాత్రుళ్లు తిరగడం వంటివి మగాళ్లు మానేయాలి. ఇళ్లలోనే ఉండాలి. అలా చేయనంత కాలం వారిపై ఎలాంటి ఆరోపణలు రావు. అంతేకాదు.. ముఖ్యంగా మగాళ్లు అసభ్యకరమైన దుస్తులు వేసుకోకుండా ఉంటే అప్పుడు మహిళలు వారిని అపార్ధం చేసుకోకుండా ఉంటారు.... అని చెప్పుకొచ్చింది. 

ఇది కేవలం జాహ్నవి భావనా లేక మహిళలందరి భావనా అనేది తేలాలి. ఎందుకంటే మహిళలకు ఎలాగైనా బతికే స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు మగాళ్లకు కూడా ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సందర్భంగా చెప్పాలంటే జాహ్నవి కపూర్‌ చెప్పినట్లు మగాళ్లు మాత్రమే కాదు.. ఆడవారు కూడా అలాగే ఆమె చెప్పినట్లు ఉంటే సగం దారుణాలు తగ్గుతాయి... అనేది వాస్తవం. ఎందుకంటే సృష్టిలో స్త్రీ, పురుషులిద్దరు సమానమే..! 

Janhvi Kapoor reveals the best thing she has read about MeToo:

Janhvi Kapoor Talks about Metoo 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ