ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా గురువారం విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోలా అరవింద సమేత ఉందని... అంటున్నారు. ఎన్టీఆర్ వీర రాఘవ రెడ్డి పాత్రలో జీవించాడని... ప్రేమికుడిగా, కొడుకుగా, ఫ్యాక్షన్ లీడర్ గా, మనవడిగా అన్ని పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపెట్టాడని... సిక్స్ ప్యాక్ తో ఇరగదీశాడంటున్నారు. త్రివిక్రమ్ తో కలిసి సాలిడ్ హిట్ అందుకున్నాడంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... సాధారణ ప్రేక్షకుడు కూడా అరవింద సమేతలో ఎన్టీఆర్ నటనను పొగుడుతున్నారు. ఇక ఎన్టీఆర్ అరవిందలోని నటనతో విమర్శకుల మెప్పు కూడా పొందాడు.
అయితే ఎన్టీఆర్ అరవింద సమేత హిట్ తో ఆనందంగా ఉన్నాడా? అంటే ఏదో అనుమానం మాత్రం కలగకుండా మానదు. ఎందుకంటే ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఎన్టీఆర్ ఎప్పటినుండో తహతహ లాడుతున్నాడు. కొరటాల శివ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనుకుంటే.. క్రిటిక్స్ నుండి వ్యతిరేఖత వచ్చినా.. కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. ఇక జై లవ కుశ సినిమాతో అయినా హిట్ కొట్టాలనుకుంటే... జైలవకుశ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో జై పార్ట్ తప్ప లవ, కుశ పార్ట్స్ తో జైలవకుశ సినిమాకి యావరేజ్ పడింది. జై కేరెక్టర్ తో నటనతో పీక్స్ కి తీసుకెళ్లిన ఎన్టీఆర్ లవ, కుశ కేరెక్టర్ తో తేలిపోవడంతో... ఆ సినిమాతోనూ ఎన్టీఆర్ అసంతృప్తిగానే ఉన్నాడు.
ఇక పన్నెండేళ్ల కల అంటూ త్రివిక్రమ్ తో సినిమా చేసి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని కలలు కన్నాడు. కానీ ఈ సినిమా టాక్ చూసిన ఎన్టీఆర్ కల కలగానే ఉండిపోయింది. అరవింద సమేతని క్రిటిక్స్ ఆకాశానికెత్తేసినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అరవిందకి పాజిటివ్ టాక్ ఇవ్వలేకపోతున్నారు. హా పర్వాలేదులే అని అంటున్నారు. మరి ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ తృప్తి పడ్డాడంటారా?.. లేదంటే అసంతృప్తిగా ఉన్నాడంటారా అనేది మాత్రం కాస్త అనుమానమే. అయితే కలెక్షన్లపరంగా మాత్రం వీరరాఘవుడు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించడం ఇక్కడ ఆనందించాల్సిన విషయం. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళితో చేయబోయే మల్టీస్టారర్ కోసం వెయిటింగ్.