Advertisementt

కౌశల్ యాటిట్యూడ్‌లో నో ఛేంజ్..!!

Mon 15th Oct 2018 12:51 AM
kaushal attitude,geetha madhuri,bhanu,bigg boss winner  కౌశల్ యాటిట్యూడ్‌లో నో ఛేంజ్..!!
No Change in Bigg Boss Winner Kaushal Attitude కౌశల్ యాటిట్యూడ్‌లో నో ఛేంజ్..!!
Advertisement
Ads by CJ

సాధారణ సెలేబ్రిటిగా బిగ్ బాస్ సీజన్ టు హౌస్ లోకి అడుగుపెట్టిన బుల్లితెర నటుడు కామ్ మోడల్ కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలవడం అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రెండు వారాలపాటు సాదాసీదాగా ఉన్న కౌశల్ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని విషయాలతో బాగా హైలెట్ అయ్యాడు. తర్వాత కూడా కౌశల్ మాములుగా తన ఆట తాను ఆడినప్పటికీ.. కాస్త కన్నింగ్ గానే ఉండేవాడు అనేది హౌస్ మేట్స్ మాత్రమే కాదు... చాలామంది బుల్లితెర ప్రేక్షకులు చెప్పిన మాట. అయితే హౌస్ బయట కౌశల్ ఆర్మీ అంటూ కౌశల్ కి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడడంతో... కౌశల్ ఒక శక్తిగా ఎదగడం స్టార్ట్ చేశాడు. ఇక బయటి నుండి హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజ నేరుగా కౌశల్ కి బయట ఒక ఆర్మీ ఉందని చెప్పడం.. ఇక కౌశల్ అప్పుడు ఒంటరిగా పోరాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చి... అందరి నుండి సానుభూతి సంపాదించడం, హౌస్ మేట్స్ అందరితో గొడవపడుతున్నట్టుగా బిగ్ బాస్ గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడడం, కౌశల్ ఆర్మీ వలన బిగ్ బాస్ విన్నరవడం జరిగాయి.

అయితే విన్నర్ గా బయటికొచ్చిన కౌశల్ చాలా స్వార్ధపరుడుగా మారాడని టాక్ వినబడుతుంది. కౌశల్ ఆర్మీ.. అది చేసే పనులను కౌశల్ సమర్ధించడం, మిగతా హౌస్ మేట్స్ తనకసలు విన్నర్ అయినా గౌరవం ఇవ్వడం లేదంటూ ఇంటర్వ్యూల్లో చెప్పడం, అలాగే తనకు సినిమా వాళ్ళ నుండి సపోర్ట్ ఉందంటూ మాట్లాడడం చూస్తున్న కౌశల్ వ్యతిరేకులు కౌశల్ కి బాగా ఎక్కువైందంటున్నారు. ఇక హౌస్ లో తనని ఒంటరిని చేసిన హౌస్ మేట్స్ తో తనకెలాంటి సంబంధం లేదని.. అసలు బయటికొచ్చాక తనని ఎవరూ కాంటాక్ట్ చెయ్యలేదని... ఇలా రకరకాలుగా మాట్లాడడంతో.. బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన సింగర్ గీతామాధురి స్పందిస్తూ కౌశల్ కి ఫోన్ చేసిన రెస్పాండ్ కావడం లేదంటూ చెప్పడం చూస్తుంటే కౌశల్ ని ఏమనాలంటున్నారు ... గీత అభిమానులు. ఇంకా గీత, కౌశల్ గురించి మాట్లాడుతూ.. కౌషల్ ఫోన్ నెంబర్ కోసం ఒకరు తనని అడగగా.. అతనికి నెంబర్ ఇవ్వొచ్చా.. లేదా అని అడగడానికి కౌశల్ కి ఫోన్ చెయ్యగా కౌశల్  స్పందించలేదని... తర్వాత అయన వైఫ్ నీలిమ గారు లైన్ లోకొచ్చారని చెప్పింది.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మరో సెలెబ్రిటీ భాను తన పుట్టినరోజు సందర్భంగా హౌస్ మేట్స్ అంతా కలుద్దామని కౌశల్ కి రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యగా కౌశల్ స్పందించలేదని కూడా గీతామాధురి చెబుతున్న మాట. మరి హౌస్ లో కౌశల్ కన్నింగ్ గా ఉన్నట్టుగానే బయట కూడా బిహేవ్ చెయ్యడం మాత్రం కొంతమంది కామెంట్స్ రూపంలో కౌంటర్లు వేస్తున్నారు. విన్నర్ గా బయటికొచ్చిన కౌశల్ కి విజయ గర్వం నెత్తికెక్కిందని.. సినిమాల్లో హీరోగా, విలన్ గా బాగా బిజీ అవుతానని కాన్ఫిడెన్స్ ఉండబట్టే కౌశల్ ఇలా మాట్లాడుతున్నాడంటున్నారు. ఏదిఏమైనా కౌశల్ తన ఆర్మీ అండ చూసుకుని ఇలా మాట్లాడుతున్నాడంటున్నారు.

No Change in Bigg Boss Winner Kaushal Attitude:

Geetha Madhuri and Bhanu Talks About Kaushal Attitude

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ