Advertisementt

‘పందెం కోడి 2’ ఫంక్షన్‌ ఇవాళే..

Sun 14th Oct 2018 09:35 PM
pandem kodi 2,vishal,keerthi suresh,pre release event  ‘పందెం కోడి 2’ ఫంక్షన్‌ ఇవాళే..
Pandem Kodi 2 Pre Release Event Details ‘పందెం కోడి 2’ ఫంక్షన్‌ ఇవాళే..
Advertisement
Ads by CJ

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’.. విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న ‘పందెంకోడి 2’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘పందెం కోడి 2’ మాస్‌ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో పందెంకోడి చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోగా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసిన చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ సహా అన్ని కమర్షియల్‌ హంగులతో తెరకెక్కిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌ను పదమూడేళ్ల తర్వాత చేస్తున్నాను. డైరెక్టర్‌ లింగుస్వామిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది..’’అన్నారు.

 నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే తమిళంలో విడుదలైన పాటలకు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌, యువన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌ అయ్యాయి. పందెంకోడి తర్వాత ఈ చిత్రం వారిద్దరి కాంబినేషన్‌లో మరో హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా అద్భుతంగా నటించారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్‌గారి పాత్ర సినిమాలో విశాల్‌గారి పాత్రకు ధీటుగా ఉంటుంది. ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి ఓ మంచి చిత్రానికి అసోసియేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా విశాల్‌ నటించిన 25వ చిత్రాన్ని మా బ్యానర్‌లో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అక్టోబర్‌ 18న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. అక్టోబర్‌ 14న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించబోతున్నాం’’ అన్నారు.

దర్శకుడు ఎన్‌.లింగుస్వామి మాట్లాడుతూ.. ‘‘పందెంకోడి తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. విభిన్న కథాంశం, డిఫరెంట్‌గా సాగే హీరో క్యారెక్టరైజేషన్‌, థ్రిల్‌ చేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌... ఇలా ఒక కమర్షియల్‌ మూవీలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పందెం కోడి 2’లో ఉన్నాయి. ఈ సినిమా విశాల్‌కి, నాకు మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది’’.. అన్నారు.

Pandem Kodi 2 Pre Release Event Details :

Pandem Kodi 2 Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ