ఒకవైపు వరుస చిత్రాలలో హీరోగా బిజిబిజీ.. మరోవైపు నిర్మాతగా క్షణం తీరికలేదు.. అతను ఎవరో కాదు.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. ఈయన మెగాస్టార్ చిరంజీవి తనయునిగా, మరోవైపు తండ్రికి తగ్గ కుమారుడిగా, అటు ఉపాసనకు భర్తగా ఎన్నో పాత్రలను ఏకకాలంలో పోషిస్తున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, వీటున్నప్పుడల్లా భార్యతో విహారయాత్రలకు వెళ్లడం, మరోవైపు 'సైరా..' వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రం నిర్మాణం, ఇంకో వైపు బోయపాటిశ్రీనుతో తన 12వ చిత్రం, దీని వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చేయబోయే మల్టీస్టారర్ చిత్రం కోసం కొత్త లుక్ వేటలో జిమ్‌లలో గడపటం .. ఇలా చరణ్‌ని చూస్తే మల్టీటాస్క్‌డ్ మెన్‌గా చెప్పవచ్చు.
ఇక ఇటీవలే ఈయన బోయపాటి చిత్రంలోని కీలకసన్నివేశాలు, పోరాట దృశ్యాల కోసం అజర్‌బైజాన్‌లో తీరిక లేకుండా గడిపాడు. ఈ చిత్రం షెడ్యూల్ పూర్తి చేసుకుని తాజాగా హైదరాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆయన మామయ్య బాధ్యతలను కూడా మర్చిపోలేదు. విషయానికి వస్తే రామ్‌చరణ్‌కి సంబంధించిన విశేషాలు, వ్యక్తిగత, ఫ్యామిలీ, సినీ కెరీర్ విశేషాలు, అభిమానులకు చరణ్ ఫొటోలను అందజేస్తూ ఆయన శ్రీమతి ఉపాసన సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. ఓవైపు అపోలో, ఇతర బాధ్యతలతో పాటు ఈమె ఈ విషయంలో అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన తన మేనకోడలి పుట్టినరోజును ఘనంగా జరిపించాడు.
ఇదే విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన ఉపాసన 'మామా డ్యూటీస్.. హ్యాపీ బర్త్‌డే' అని చెబుతు ఓ ఫోటోని పోస్ట్ చేసింది. రామ్‌చరణ్ మేనకోడలితో పాటు ఈ ఫొటోలోని చిన్నారులలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్, మరికొందరు ఉన్నారు. చెర్రీ తానే దగ్గరుండి మేనకోడలి చేత కేక్ కట్ చేయిస్తున్నాడు. ఈ పిక్‌లో అయాన్ తన చూపునంతా కేక్ పైనే చూపిస్తూ ఉండటంతో 'అల్లువారబ్బాయి చూపంతా కేక్ పైనే ఉంది.. అంటూ పలువురు నెటిజన్లు సరదా కామెంట్స్ పెడుతున్నారు.