బుల్లితెర నటుడు కౌశల్ కి బిగ్ బాస్ పుణ్యమా అని కౌశల్ ఫ్యాన్స్ అంటూ కౌశల్ ఆర్మీ వ్యవస్థ ఒకటి స్టార్ హీరోల ఫ్యాన్స్ మాదిరిగా తయారైంది. స్టార్ హీరోలకుండే అభిమాన గణం ఇప్పుడు కౌశల్ కి ఉన్నారు. కౌశల్ లో ఏం చూసి కౌశల్ ఆర్మీ అతనిని అభిమానించిందో తెలియదు కానీ.. కౌశల్ ఆర్మీ వలన కౌశల్ ఒక శక్తిగా మారాడు. కౌశల్, కౌశల్ ఆర్మీని చూసుకుని బాగా విర్రవీగుతున్నాడనే ప్రచారము ఉంది. అయితే ఇప్పుడు కౌశల్ ఆర్మీని చూసే సినిమా ప్రముఖులు కౌశల్ కి సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఏమో చెప్పలేం కానీ.. కౌశల్ కి సినిమా పరిశ్రమ నుండి పెద్ద ఎత్తున అభినందనలు దక్కుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడే కౌశల్ ని మారుతీ, కోన వెంకట్ వంటి వారు సమర్ధించగా... బిగ్ బాస్ విన్నర్ గా బయటికి రాగానే తనకి మారుతీ, సుకుమార్ వంటి దర్శకుడు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని కౌశల్ స్వయంగా చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ కూడా కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయినందుకు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ అవడం కన్నా మహేష్ చేసిన ట్వీట్ ప్రత్యేకం అంటూ కౌశల్ చెప్పాడు. ఇక బోయపాటి నుండి తనకు చరణ్ సినిమా RC12 లో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని.. ఆ వివరాలు త్వరలోనే చెబుతానంటున్నాడు.
అయితే వీరంతా కౌశల్ కి సపోర్ట్ చెయ్యడానికి కారణం మాత్రం కౌశల్ ఆర్మీనే అంటున్నారు కొంతమంది. కౌశల్ కి ఇలా ప్రముఖుల సపోర్ట్ కౌశల్ ఆర్మీని తమ వైపు తిప్పుకోవడానికి అన్నట్టుగా వారు మాట్లాడడం చూస్తుంటే కౌశల్ ఎదుగుదలను వారు ఓర్చలేకపోతున్నారా.. లేదంటే వారు చెప్పినట్టుగానే ప్రముఖులంతా కౌశల్ ఆర్మీని తమ వైపు తిప్పుకోవడానికి ఇలాంటి బిల్డప్ ఇస్తున్నారా... అనేది మాత్రం క్లారిటీ లేదు. స్టార్ హీరోలకున్న అభిమాన గణం కౌశల్ కి ఉండబట్టే ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియా టాక్.