ఈ మధ్యన పెద్ద సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ కి ఎంత బిజినెస్ జరుగుతుందో.... ఆ సినిమా శాటిలైట్స్ హక్కులకు అంతే ఆసక్తికర ధర పలుకుతుంది. ట్రేడ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ మీదున్న క్యూరియాసిటీ శాటిలైట్స్ హక్కులకు ఉంటుంది. అందులోను దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో ఎంత క్రేజ్ ఉంటుందో... ఛానల్స్ మధ్యన అంతే పోటీ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ కన్నా శాటిలైట్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి కాబట్టి.
గురువారం విడుదలైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల అరవింద సమేత వీర రాఘవ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా టాక్ తో కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ శాటిలైట్ హక్కుల కోసం ఛానల్స్ మధ్య పోటీ ఏర్పడడం... చివరికి అరవింద సమేత జి తెలుగు ఛానల్ 23.50 కోట్లుకు శాటిలైట్స్ హక్కుల డీల్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం ఇది త్రివిక్రమ్ స్టామినాతోనే జరిగిందంటున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ ధర.
ఇక అరవింద విడుదలైన ప్రతిచోట కలెక్షన్స్ కుమ్మేస్తుంటే.. ఇప్పుడు శాటిలైట్ హక్కులతో రికార్డు సృష్టించింది. అయితే ఓవర్సీస్ లోను ఈ సినిమా హిట్ అవడం, పాజిటివ్ టాక్ రావడం, త్రివిక్రమ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాకి ఇంత భారీ ధర పలికినట్లుగా టాక్.