కాస్టింగ్‌కౌచ్ విషయంలో అన్నింటిలాగే రెండు పార్శ్వాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నటీమణులు తమని వారు, వీరు వేధించారని చెప్పి, మీడియాకు వెళ్లి నానా రచ్చ చేస్తున్నారే గానీ తమని ఎవరు వేధించింది? అనేది పేరు చెప్పకుండా అందరి మీద అనుమానాలు కలిగేలా సినిమా రంగం అంటే చెడ్డ అభిప్రాయం, చులకన భావం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు మాత్రం కాస్టింగ్‌కౌచ్ అనేది నిజమే. దానిని మేము కూడా విని ఉన్నాం. కానీ మాకు మాత్రం అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదంటూ డబుల్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇక శ్రీరెడ్డి బయటపెట్టిన ఒకే ఒక్క విషయం రానా సోదరుడితో ఆమె కలిసి కాస్త రొమాంటిక్‌గా ఉన్న ఫోటో మాత్రమే. అది కూడా ఏదో మంచి సాన్నిహిత్యం కొద్ది ఆ ఫొటోను తీసినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ నటి మాత్రం పక్కా ఆధారాలతో ముందుకు వచ్చింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టాప్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించింది.
వివరాలలోకి వెళ్తే, ప్రముఖ ఉత్తరాది, బాలీవుడ్ నటి గీతిక త్యాగి. గతంలో ఈమె బిపాసాబసుతో కలిసి 'త్యాగి'లో నటించింది. ఇక ఈమె చెంప చెల్లుమనిపించిన దర్శకుడు 'జాలీ ఎల్‌ఎల్‌బి' సుభాష్ కపూర్. ఈయన మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మంచి కాన్సెప్ట్, సోషల్‌మెసేజ్ ఉన్న చిత్రాలను తీస్తాడనే పేరు ఉంది. ఈయనకి దివ్యాంగుడు. ఎడమచేయి లేదు. కానీ ఆయన నిజస్వరూపం త్యాగి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా బట్టబయలు చేసింది. ఓ మీడియా సంస్థ త్యాగిని, సుభాష్, అతని శ్రీమతి డింపుల్‌లని స్టూడియోకి ఆహ్వానించి నిజానిజాలు తెలియజేసే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో సుభాష్ తన తప్పేమీ లేదని తన భార్యకి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. దాంతో సుభాష్ చెప్పినవన్నీఅబద్దాలే అని గీతిక త్యాగి ఏడ్చింది. భార్య పక్కనే ఉన్నా కూడా సుభాష్ చెంపను అందరు చూస్తుండగానే చెల్లుమనిపించింది. ఆ దృశ్యం సీసీ కెమెరాలలో రికార్డ్ కావడంతో బయటకు వచ్చింది. అయితే గీతిక పోస్ట్ చేసిన వీడియోలో ఆమె దర్శకుడిని తిడుతున్నట్లుగానే ఉంది. అతడిని కొట్టిన దృశ్యాలను కావాలనే కట్ చేశారని అర్ధమవుతోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో సుభాష్‌కపూర్‌తో కలిసి 'మొఘల్' చిత్రం చేయాల్సిన అమీర్‌ఖాన్ ఈ చిత్రం నుంచి బయటకు వచ్చాడని, నిర్మాత భూషణ్‌కుమార్ కూడా అతనిపై తీవ్ర చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారట. నిజంగా ఇలా ఆధారాలతో సహ బయటకు వస్తే మాత్రం అందరు నటీమణులకు అండగా నిలబడతారు. అంతేగానీ నోటికి వచ్చిన వారిపై నిందలు వేయడం, నిజమో కాదో తెలియకుండానే అందరు వారికి మద్దతు పలకడం సరికాదు.