Advertisementt

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఈసారి ముగ్గురితో..

Sat 13th Oct 2018 11:44 PM
vijay deverakonda,kranthi madhav,3 heroines,creative commercial  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఈసారి ముగ్గురితో..
3 Heroines in Vijay Deverakonda and Kranthi Madhav Film విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఈసారి ముగ్గురితో..
Advertisement
Ads by CJ

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం.. 

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్మాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఈయ‌న చేస్తోన్న తొలి సినిమా ఇది. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర‌యూనిట్ తెలియ‌జేయ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. 

3 Heroines in Vijay Deverakonda and Kranthi Madhav Film:

Vijay Deverakonda, Kranthi Madhav & Creative Commercial Production No 46

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ