పాపం పూజా హెగ్డే. ఏ సినిమాలో నటించినా ఇప్పటివరకు ఆమెకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా తగల్లేదు. ఒక లైలా కోసం, ముకుందా, మోహింజదారో లాంటి సినిమాల్లో హీరోయిన్ గా ఒకమాదిరి పేరు సంపాదించిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ తో కలిసి నటించిన డీజే దువ్వాడ జగన్నాధం సినిమాతో హిట్ కొట్టింది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ కాలేదు. ఆ సినిమాకి పూజా అందాలు, బికినీ షో మెయిన్ ప్లస్ గా నిలిచాయి. అసలా సినిమాకి చాలామంది పూజా హెగ్డే వేసిన బికినీ కోసమే వెళ్లారంటే నమ్మాలి మరి. ఇక తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి సాక్ష్యం సినిమాలో నటించింది. ఆ సినిమాలో అందంగా గ్లామర్ షో చేసినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక పూజా హెగ్డే స్టార్ హీరోలతో సినిమాలు సైన్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఎన్టీఆర్ తో, మహేష్ తో, ప్రభాస్ తో వరసగా సినిమాలు ఒప్పేసుకుంది.
ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించిన అరవింద సమేత - వీర రాఘవలో సగం టైటిల్ రోల్ పోషించింది ఈ పూజా హెగ్డే. అయితే అరవిందగా పూజా హెగ్డే ఇప్పుడైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా అంటే అనుమానమే. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవకు క్రిటిక్స్ అంతా ఏక కంఠంగా హిట్ మార్కులేసి పాస్ చేయించారు. ఇక దసరా బరిలో ఉన్న మొదటి సినిమా కావడం, ఫస్ట్ హాఫ్ డల్ అయినా.. సెకండ్ హాఫ్ లో ఉన్న డెప్త్ తో సినిమా హిట్ టాకిచ్చారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన పూజా హెగ్డే సినిమాకి మరీ ప్లస్ అయ్యే పాత్రనేం చెయ్యలేదు. దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్డే పాత్రని అతి ముఖ్య పాత్రగా రాసుకోలేదేమో. టైటిల్ లో సగ భాగం ఇచ్చిన త్రివిక్రమ్ సినిమాలో ఆమె పాత్రకి సగ భాగం ఇవ్వలేకపోయాడు. పూజా హెగ్డే అరవింద గా గ్లామర్ డాల్ లా కనిపించింది. కానీ ఆమె పల్చని అందాలు అంతగా ఆకట్టుకోలేదు.
సినిమాలో పూజా ఓకే అనిపిస్తుంది. కథలో ఆమె పాత్రని వాడుకున్న విధానం బాగుంది. అలాగే పూజా హెగ్డే గ్లామరస్‌గా వుంది., కానీ ఆమె సొంత గొంతు మాత్రం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టింది. ఈ పాత్ర చిత్రణ ఇలా జరిగి వుండాల్సింది కాదేమోననే భావన కలుగుతుంది. సినిమాలో అరవింద పాత్ర అనుకున్న స్థాయిలో పండలేదు. ఆమె తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఉన్నంతలో నటన పర్వాలేదు. కానీ ఆమెను టైటిల్ రోల్ లో తీసుకున్నందుకు ప్రేక్షకుడు ఎక్కువగా ఊహించుకుంటే సినిమా చూసాక ఉసూరు మనాల్సిందే. కాకపోతే ఎన్టీఆర్ పక్కన పర్వాలేదనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ నటన ముందు పూజ మాత్రం తేలిపోయింది. మరి అరవింద తో అయినా పూజా బ్లాక్ బస్టర్ కొట్టిందంటారా... ఏమో అది తెలియాలంటే ఈ పండగ పూర్తి అవ్వాల్సిందే.