Advertisementt

ఈ లుక్‌లో గంభీరత్వం చూశారా..!

Sat 13th Oct 2018 04:00 PM
amitabh bachchan,gosai venkanna,sye raa narasimha reddy,chiranjeevi,birthday special  ఈ లుక్‌లో గంభీరత్వం చూశారా..!
Big B Look From Sye Raa Released ఈ లుక్‌లో గంభీరత్వం చూశారా..!
Advertisement
Ads by CJ

బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఇండియన్‌ సినీ చరిత్రలోనే దేశానికే సూపర్‌స్టార్‌ అనేది ఒప్పుకోవాలి. మొదట్లో అమితాబ్‌ సినిమాలలో చాన్స్‌ల కోసం వెళ్లితే, సన్నగా రివాటులాగా ఉన్నావు. సరైనబాడీ లేదు. చెట్టంత ఎత్తు మాత్రం ఉన్నావు అంటూ అవహేళన చేసేవారు. ఇక మరికొందరు అమితాబ్‌ బచ్చన్‌ గొంతు విని ఇదేదో ముక్కుతో మాట్లాడుతున్నట్లుగా ఆర్టిఫిషీయల్‌గా ఉంది. కాబట్టి ఈ వాయిసే నీకు పెద్ద మైనస్‌ పాయింట్‌ అని ముఖాన చెప్పి ఆయనను అవమానించారు. కానీ వారు ఏమైతే అమితాబ్‌లో ఉన్న మైనస్‌లను చెప్పారో తదుపరి కాలంలో ఆయనకు అవే స్టార్‌డమ్‌ని, ప్రేక్షకులను, అభిమానులను సాధించిపెట్టాయి. ఎవర్‌గ్రీన్‌ యాంగ్రీ యంగ్‌మెన్‌గా నిలిచాయి. ‘జంజీర్‌, షోలే’లతో ఎన్నో దశాబ్దాలు భారతీయ సినీ పరిశ్రమను ఏకచ్చత్రాధిపత్యంగా శాసించాడు. యాక్షన్‌ చిత్రాలకు, తన గంభీరమైన వాయిస్‌తో ఆయన దూసుకుపోయాడు. 

కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం ఆయన రొమాంటిక్‌, పూర్తియాక్షన్‌ చిత్రాల నుంచి, హీరోయిన్లతో గెంతులు వేస్తూ వెకిలిచేష్టలు చేయకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఎందుకంటే మన టాలీవుడ్‌ అంత వయసు ఉన్నవాళ్లు, ముని మనవరాళ్ల వంటి హీరోయిన్లతో రొమాన్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తన పాత్ర బాగుంటే చిన్న చిన్న పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అమీర్‌ఖాన్‌తో కలిసి ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రం చేశాడు. 

ఇక తెలుగులో ఆయన అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మనం’లో తళుక్కున్న అతిధి పాత్రలో మెరిశాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘సైరా.. నరసింహారెడ్డి’లో చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో ఆ స్థాయి చిత్రంగా దీనిని చెప్పుకుంటున్నారు. స్వయాన రామ్‌చరణ్‌ నిర్మాతగా కొణిదెల బేనర్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి నుంచి అమితాబ్‌.. చిరంజీవి గురువుగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా అదే నిజమని ప్రూవ్‌ అయింది. 

అమితాబ్‌ 76వ జన్మదిన వేడుకల సందర్భంగా ఇందులోని ఓ మోషన్‌ టీజర్‌ని యూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ గంభీరంగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నాడు. ఆల్‌రెడీ ఇప్పటికే సినిమా షూటింగ్‌లో అమితాబ్‌, చిరంజీవి వంటి వారు హోమం చేస్తోన్న ఫొటో ఆల్‌రెడీ లీక్‌ అయింది. ఇక అమితాబ్‌ నటించడం వల్ల ఈ ‘సైరా’కి బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ పెరగడం ఖాయమనే చెప్పాలి. చిరు కూడా బాలీవుడ్‌ ప్రేక్షకులకు కొన్ని స్ట్రెయిట్‌ హిందీ చిత్రాల ద్వారా పరిచయమే. 

Big B Look From Sye Raa Released:

Amitabh Plays Gosai Venkanna Role in Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ