Advertisementt

ప్రభాస్ సినిమా టైటిల్ మారింది..!!

Sat 13th Oct 2018 03:35 PM
prabhas,jaan,jil radhakrishna,prabhas20,title,amour  ప్రభాస్ సినిమా టైటిల్ మారింది..!!
One More title to Prabhas 20th Film ప్రభాస్ సినిమా టైటిల్ మారింది..!!
Advertisement
Ads by CJ

ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్ చేస్తూనే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20 వ మూవీలో నటిస్తున్నాడు. సాహో సినిమా గత ఏడాది మొదలైతే.. జిల్ రాధాకృష్ణ సినిమా ఈ మధ్యనే పట్టాలెక్కింది. రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ పక్కన మొదటిసారి పూజా హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ 20 మూవీ టైటిల్ గా అమూర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది.

అమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అని అర్ధం అంటూ ప్రచారం ఒక రేంజ్లో జరిగింది. అయితే తాజాగా ప్రభాస్ 20కి అమూర్ టైటిల్ కాదని...జాన్ అనే వేరొక టైటిల్ ని ఫైనల్ చేశారన్నటాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే  జాన్ అనేది తాను లవర్ ని పిలుచుకునే పిలుపు అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇక జాన్ అనే టైటిల్ ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని.. అందుకే ప్రభాస్ - రాధాకృష్ణ టైటిల్ జాన్ గా ఫైనల్ అంటున్నారు. 

ఈ సినిమా కూడా పలు భాషల్లో తెరకెక్కడంతో అప్పుడే అంచానాలు మొదలైపోయాయి. యువి క్రియేషన్స్ - గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

One More title to Prabhas 20th Film:

Darling Prabhas Becomes Jaan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ