రాజుల కుటుంబం, మంచి ఆర్ధిక బలం కలిగిన హీరోయిన్లలో హైదరాబాద్ చిన్నది అదితీరావు హైదరి ఒకరు. ఈమె మణిరత్నం చిత్రం 'చెలియా'లో నటించి, కార్తీ కంటే మంచి పేరు సాధించింది. అతి తక్కువ చిత్రాలతోనే అందరు నటించాలని కలలు గనే మణి చిత్రంలో చాన్స్ రావడం అంటే సామాన్యమేమీ కాదు. హీరోయిన్ల సెలక్షన్స్‌తో మణి కంటూ ప్రత్యేకశైలి ఉంది. ఇక ఆ చిత్రం పరాజయం పాలైనా ఇటీవల ఆమె సుధీర్‌బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'సమ్మోహనం' లో నటించి అందరిని సమ్మోహన పరిచి తన వైపుకు తిప్పుకుంది.
అలాంటి హీరోయిన్ తాజాగా కాస్టింగ్‌కౌచ్ విషయంలో చెప్పిన సంఘటనలు సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఇది ఎంతో కాలంగా ఉంది. కాంప్రమైజ్ అయిన వారు చెప్పింది చేస్తే వరుసగా అదే బేనర్‌లో మూడు చిత్రాలలో చాన్స్ ఇస్తామని కొందరు ఆఫర్ చేశారు. కానీ నాకు అలాంటివి వద్దని చెప్పి బయటకు వచ్చేశాను. ఆత్మగౌరవాన్నికాపాడుకుంటూ వస్తున్నాను. ఇలాంటి విషయాలలో నేను రాజీపడను.
కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలబడటం కష్టమే గానీ అసాధ్యం మాత్రం కాదు. దానికి నేనే ఉదాహరణ. సినీ పరిశ్రమలో ఎదురయ్యే ఆటంకాలను, వేధింపులను మనం ఎలా ఎదుర్కొంటాం అనే దానిపైనే మన కెరీర్ ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పుకొచ్చింది.