Advertisementt

విమర్శకులకు విజయ్ దేవరకొండ వార్నింగ్..!!

Fri 12th Oct 2018 03:13 PM
vijay deverakonda,warning,troll,nota,letter,rowdy  విమర్శకులకు విజయ్ దేవరకొండ వార్నింగ్..!!
Vijay Deverakonda warning to Trollers విమర్శకులకు విజయ్ దేవరకొండ వార్నింగ్..!!
Advertisement
Ads by CJ

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ నుంచి తన యాటిట్యూడ్‌ని చూపిస్తూ వస్తున్నాడు. వివాదాస్పదమైన వ్యాఖ్యలతో, సంభాషణలతో, ఇంటర్వ్యూలలో కూడా తనదైన శైలిని చూపిస్తున్నాడు. ఇక ఈయన ఏకంగా తనకి తాను రౌడీని అని, తన అభిమానులను రౌడీ గ్యాంగ్‌గా చెబుతూ ఉంటాడు. ‘పెళ్లిచూపులు, మహానటి, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం’తో సెన్సేషనల్‌ స్టార్‌ అయ్యాడు. కాబట్టి విజయాలలో ఉన్న వారిపై పెద్దగా విమర్శలు రావు కానీ వారికి ఒక్క భారీ డిజాస్టర్‌ వస్తే మాత్రం వారి వ్యతిరేకుల ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఇది సహజం. 

ఇప్పుడు విజయ్‌దేవరకొండ విమర్శకులకు ‘నోటా’ ద్వారా పని కల్పించాడు. దాంతో ఇప్పటికే తానో పెద్ద స్టార్‌గా భావిస్తూ, ఆయన మాట్లాడే మాటలు విని నచ్చని వారు ‘నోటా’తో ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే విజయ్‌పై విమర్శలు సంధిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన.. ‘‘నా వ్యతిరేకులు ఇప్పుడే పండగ చేసుకోవాలి. ఎందుకంటే నేను మరలా వస్తున్నా...! నాకోసం ‘నోటా’ చిత్రానికి థియేటర్లకు వెళ్లి చూస్తోన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ప్రేమకు ఆనందపడుతున్నాను. కానీ నా వ్యతిరేకులు, నా చిత్రం ఫ్లాప్‌ కావాలని కోరుకునే వారు ఇప్పుడే సెలబ్రేట్‌ చేసుకోండి. నేను సాకులు చెప్పను. బాధ్యతను మాత్రం తీసుకుంటాను. 

‘నోటా’ విషయంలో నేను గర్వంగా ఉన్నాను. ఇది మీకు నేను చెప్పాలి.. చూపించాలనుకున్న కథ. తమిళనాడు, జాతీయ మీడియా, ప్రేక్షకులు ‘నోటా’ని బాగా ఆదరిస్తున్నారు. నాపై వచ్చిన విమర్శలను సీరియస్‌గా శోధించా. నా పరంగా చేసిన తప్పులను సరిదిద్దుకున్నాను. సరైన నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నా. అంత మాత్రాన నా స్వభావం మారదు. జయాపజయాలు రౌడీని తయారు చేయలేవు. కాబట్టి అవి నన్ను బ్రేక్‌ కూడా చేయలేవు. 

రౌడీగా ఉండటం అంటే విజయం పొందడమే కాదు. ఆ విజయం కోసం పోరాడడం. ఇది మనలోని స్వభావం. కాబట్టి పోరాడుతూనే ఉందాం..!గెలిస్తే గెలుస్తాం.. లేకుంటే నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ తరుణాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నవారికి చెబుతున్నా. ఇప్పుడే పండగ చేసుకోండి. ఎందుకంటే మరలా నేను వస్తాను (విజయంతో)’’ అని చెప్పుకొచ్చాడు. 

Vijay Deverakonda warning to Trollers:

Vijay Deverakonda speaks about NOTA Result 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ