స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్నో పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలలో నటించాడు. కానీ కమర్షియల్‌గా ఎవ్వరూ అందుకోలేంత స్థానం ఆయనకు ‘అడవిరాముడు, వేటగాడు’ చిత్రాల ద్వారా వచ్చింది. ఎన్టీఆర్‌కి మనవరాలిగా నటించిన అతిలోకసుందరి శ్రీదేవి.. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన నటించి యువతకు కలల రాణిగా మారింది. ఈ డ్రీమ్‌గర్ల్ ‘వేటగాడు’తోనే కమర్షియల్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ని సాధించింది. అందునా ‘వేటగాడు’ చిత్రంలోని ‘ఆకు చాటు పిందె తడిసే’ పాట నాడు అందరినీ ఉర్రూతలూగించింది. ఎన్టీఆర్, శ్రీదేవిల మధ్య వయసు తేడా ఎంతో ఉన్నప్పటికీ శ్రీదేవి అందచందాలను, వాన పాటలో ఆమె అందాల ప్రదర్శన, చూపి చూపకుండానే తన సొగసులను చూపిన తీరుకి అందరు ఫిదా అయిపోయారు.
దాని తర్వాత ఎన్టీఆర్-శ్రీదేవిలు కలిసి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో నటించారు. కాబట్టి ప్రస్తుతం రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా శ్రీదేవి పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఎన్టీఆర్ సినీ జీవితం ఆధారంగా రూపొందుతున్న మొదటి పార్ట్‌కి ‘కథానాయకుడు’ అని, రెండో పార్ట్‌ని ఆయన రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గా బాలకృష్ణ, క్రిష్‌లు మలుస్తున్నారు. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇక శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ప్రీత్‌సింగ్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా బాలకృష్ణ-రకుల్‌ప్రీత్‌సింగ్‌లపై ‘ఆకుచాటు పిందెతడిసే’ పాటను చిత్రీకరించారు. తాజాగా రకుల్ బర్త్‌డే సందర్భంగా ఇందులోని శ్రీదేవి లుక్‌లో ఉన్న రకుల్ స్టిల్‌ని విడుదల చేసిన యూనిట్ ఈ పాటలోని స్టిల్‌కి కూడా రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఎన్టీఆర్‌ని మరపించేలా బాలయ్య ఉన్నాడు. నాటి బెల్‌బాటం ప్యాంట్, ఒంటిపై కోటు, నెత్తిన టోపీతో కనిపిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఆ పాటలోని శ్రీదేవిని మరపుకు తెస్తోంది. ఈ స్టిల్ మాత్రం నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. సినిమాపై అంచనాలను మరింత భారీగా పెంచిందనే చెప్పాలి.