Advertisementt

విజయ్ దేవరకొండ.. ఈ మూవీ రిలీజ్ అవుతుందా?

Fri 12th Oct 2018 12:09 AM
taxiwaala,vijay deverakonda,nota,geetha govindham,release problems  విజయ్ దేవరకొండ.. ఈ మూవీ రిలీజ్ అవుతుందా?
Release Problems to Vijay Deverakonda Taxiwaala విజయ్ దేవరకొండ.. ఈ మూవీ రిలీజ్ అవుతుందా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ అరవింద సమేత మ్యానియా నడుస్తుంది. గురువారం విడుదలకాబోతోన్న ఎన్టీఆర్ అరవింద సమేత మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అరవింద సమేత హడావిడి లో విజయ్ దేవరకొండ నోటా సినిమా మరుగున పడిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా తమిళం, తెలుగులో తెరకెక్కిన నోటా సినిమా గత శుక్రవారమే విడుదలైంది. గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి... 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ కి నోటా తో షాక్ తగిలింది. ఇక నోటా ప్లాప్ తో విజయ్ దేవరకొండ మార్కెట్ కూడా కాస్త అటు ఇటుగా అతలాకుతలం అయ్యినట్లుగానే కనబడుతుంది.

మరి గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పుడే విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం విడుదలకావడానికి అష్ట కష్టాలు పడింది. ఎప్పుడో షూటింగ్ పూర్తయ్యి... విజయ్ కున్న క్రేజ్ తో సినిమా విడుదలవుతుంది అనుకుంటే.. ఆ సినిమాకి ఇప్పట్లో మోక్షం కలిగేలా కనబడడం లేదు. గీత గోవిందం కన్నా ముందు విడుదలకావాల్సిన టాక్సీవాలా సినిమా ఇప్పటికి విడుదల కాలేదు. మధ్యలో టాక్సీవాలా సినిమా ఇంటర్నెట్ లో లీక్ అవడం... నిర్మాత ఆ లీకుదారులను పోలీస్‌లకు పట్టివ్వడం.. తర్వాత సినిమా ఆన్ లైన్ లో వైరల్ కాకుండా ఆపడం.. ఇలా చాలా పెద్ద తతంగమే నడిచింది. ఇక ఈ నోటా దెబ్బకి టాక్సీవాలా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా కనబడుతుంది.

నోటా హిట్ అయితే విజయ్ క్రేజ్ తో టాక్సీవాలను థియేటర్స్ లోకి దింపేవారు మేకర్స్. కానీ నోటా టాక్ తేడా కొట్టడంతో.. ఇప్పుడు టాక్సీవాలా సినిమాకి కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఎలాగూ టాక్సీవాలా సినిమాని డైరెక్ట్ గా ఆన్ లైన్ లో విడుదల చేద్దామని మేకర్స్ గతంలో అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఆ మేటర్ మాత్రం ప్రస్తుతం ఎక్కడా వినబడడం లేదు. ఏది ఏమైనా విజయ్ తమిళ డెబ్యూ నిర్ణయం మాత్రం తేడా కొట్టడమే కాదు.. విజయ్ కున్న క్రేజ్ ని బాగా తగ్గించేసిందనే చెప్పాలి.

Release Problems to Vijay Deverakonda Taxiwaala:

Nota effect on Vijay Deverakonda Taxiwaala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ