Advertisementt

నిజంగా ఈ నటి మనోధైర్యానికి హ్యాట్సాఫ్‌!

Thu 11th Oct 2018 01:18 PM
sonali bendre,cancer patient,latest tweet,sensation  నిజంగా ఈ నటి మనోధైర్యానికి హ్యాట్సాఫ్‌!
Hats-off to Sonali Bendre నిజంగా ఈ నటి మనోధైర్యానికి హ్యాట్సాఫ్‌!
Advertisement
Ads by CJ

నిజానికి సృష్టిలో భగవంతుడు శారీరక అవయవాలు, అంగ బలాలలో పురుషులకి కాస్త ఎక్కువ శక్తిని ఇచ్చాడు. కానీ స్త్రీలకు మాత్రం తెలివి, సమయస్ఫూర్తి, మనోనిబ్బరం, సహనం, ఒకేసారి పలు బాధ్యతలను నిర్వహించగలిగిన నేర్పు, ఓర్పు, గుండెధైర్యం ఇచ్చాడు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న అందాల స్టార్‌ హీరోయిన్‌ సోనాలిబింద్రే. ప్రస్తుతం ఈమె తీవ్రమైన క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె చికిత్సతీసుకుంటూ మరణించిందని కూడా సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. చాలా కాలం తర్వాత మరలా సోనాలిబింద్రే న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటూ తన మనోభావాలను ప్రజలకు తెలిపింది. 

ఈ సందర్భంగా ఈమె తన ట్వీట్‌లో.. గత కొన్ని నెలలుగా నాకు జీవితంలో మంచి, చెడు రెండు ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయాను. కనీసం చేతి వేళ్లు పైకెత్తి శక్తి కూడా లేకుండా పోయింది. శారీరకంగా మొదలైన ఈ నొప్పి తర్వాత మానసికంగా, ఎమోషనల్‌గా కూడా దెబ్బతీస్తోంది. కీమో థెరపి, చికిత్స, సర్జరీ తర్వాత కొన్ని రోజులు బాగా కష్టమైపోయింది. కనీసం నవ్వినా నొప్పివచ్చేది. కొన్నిసార్లు క్యాన్సర్‌ నా నుంచి అన్నింటినీ తీసుకుంటున్న భావన కలిగింది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నాను. ఇలాంటి చెడురోజులు జీవితంలో ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు కృషి చేయాలి. ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చాను. మనకేం అవుతోందో.. మనం ఎటు వైపు వెళ్తున్నామో కేవలం మనకి మాత్రమే తెలుస్తుంది. దానిని అంగీకరించడమే మంచిది. 

భావోద్వేగాలకు గురి కావడం తప్పుకాదు. నెగటివ్‌ ఎమోషన్స్‌ని ఫీల్‌ కావడం కూడా తప్పేం కాదు. కానీ ఆ తర్వాత దానిని గుర్తించాలి. మన జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గంచుకుంటూ ఉండాలి. ఆ జోన్‌ నుంచి బయటకు రావడానికి చాలా స్వీయజాగ్రత్త అవసరం. ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడంలో నిద్ర చాలా సహాయపడుతుంది. నాకు నా కుమారుడితో మాట్లాడుతూ ఉంటే చెడు ఆలోచనలు రావు. ఇప్పుడు నా చికిత్స కొనసాగుతోంది. నా రూపం చక్కగా మారింది. త్వరలో ఇంటికి వచ్చేస్తాననే నమ్మకం ఉంది. చెడురోజులు జీవితంలో అందరికీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండాలనేది నా సలహా అంటూ తాను పడుతున్నవేదనను, దానిని అధిగమిస్తున్న విషయాన్ని ఎంతో చక్కగా చెప్పుకొచ్చింది. 

Hats-off to Sonali Bendre:

Sonali Bendre Latest Tweet creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ