Advertisementt

‘అరవింద సమేత’లో సునీల్ పాత్రే హైలెట్ అంట!

Thu 11th Oct 2018 01:03 PM
aravinda sametha,sunil,important role,trivikram,jr ntr  ‘అరవింద సమేత’లో సునీల్ పాత్రే హైలెట్ అంట!
Sunil Role in Aravinda Sametha Revealed ‘అరవింద సమేత’లో సునీల్ పాత్రే హైలెట్ అంట!
Advertisement
Ads by CJ

చాలాకాలం తర్వాత హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో సునీల్.  కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ మళ్ళీ త్రివిక్రమ్ అరవింద సమేత తో కమెడియన్ గా రీ ఎంట్రీ  ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు సునీల్ హాస్యానికి పడి చచ్చే అభిమానులు ఉండేవారు. కానీ హీరోగా మారిన సునీల్ కొన్నాళ్ళకు హీరో భారాన్ని మోయలేక మళ్ళీ కమెడియన్ గా మారిపోతున్నాడు. స్నేహితుడైన త్రివిక్రమ్ సినిమాతోనే సునీల్ మళ్ళీ కామెడీ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఎన్ని వేషాలేసిన ఫ్రెండ్ కదా.. మళ్ళీ తనని దగరికి తీస్తాడులే అని సునీల్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమే అన్నట్టుగా... అరవింద సమేత లో సునీల్ కి హీరో పక్కన ట్రావెల్ చేసే పాత్రనే ఇచ్చాడు. స్నేహితుడిలో ఆల్‌రౌండ‌ర్‌ని ఆడియ‌న్స్‌కి మ‌రోసారి ప‌రిచ‌యం చేసే విధంగా ఒక పాత్రను డిజైన్ చేసాడట త్రివిక్రమ్. 

ఇక అరవింద సమేత - వీర రాఘవ లో సునీల్ నీలాంబరిగా ఎన్టీఆర్ తో ట్రావెల్ చేస్తూ హాస్యం పండించడమే కాదు ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తాడట. సునీల్‌లో కామెడీనీ, ఎమోష‌న్‌నీ రెండింటీని త్రివిక్రమ్ బయటికి తీసాడనే టాక్ నడుస్తుంది. ఇక అరవింద సమేతలో చిన్న గ్యారేజ్ ని నడుపుకుంటూ ఎదుగుబొదుగూ లేకుండా ఉన్న నీలాంబరి(సునీల్) కి.. రాఘవ(ఎన్టీఆర్) అండగా నిలబడి మంచి స్థాయికి చేరుకునేలా చేస్తాడట. ఇక ఎన్టీఆర్ అదేనండి రాఘవ తన ఊరికి వెళ్లే క్రమంలో సునీల్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్. అయితే నీలాంబరిగా హాస్యం పండించే పాత్రకు ముగింపు విషాదకరమే అని తెలుస్తుంది. 

సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్ నీలాంబరి.... సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్‌తో కలిసి నవ్వించిన సునీల్.... విషాదకర ఘటనలో తన నటనతో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాడట. ఇక అరవింద సమేత ఫస్ట్ హాఫ్ అంతా.. అరవింద - రాఘవల మధ్య లవ్ స్టోరీతో శ్రీనివాస రెడ్డి, సునీల్ ల కామెడీతో లాగించేసి.... సెకండ్ హాఫ్ లో మాత్రం విలన్ జగపతి బాబు.... ఎన్టీఆర్ వర్గాల పోరును మధ్యలో నలిగిపోయిన కుటుంబాల వ్యధలను అద్భుతంగా తెరకెక్కించాడట త్రివిక్రం. ఇకపోతే ఈ సినిమా ద్వారా సునీల్ నటుడిగా మంచి పేరొస్తుందని... మళ్ళి కమెడియన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ బిజీ అవుతాడని చెబుతున్నారు.

Sunil Role in Aravinda Sametha Revealed:

Sunil Important Role in Aravinda Sametha