ఎన్టీఆర్ అరవింద సమేత హడావిడి థియేటర్స్ దగ్గర స్టార్టయ్యింది. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో అరవింద సమేత షో పడబోతుంటే.. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు గురువారం ఐదు గంటలకే అరవింద సమేత ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతాయి. ఇక బీభత్సమైన పబ్లిసిటి తో దూసుకుపోతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం అరవింద సమేత సినిమా కథ... కథలు కథలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరికందిన సమాచారం ప్రకారం వారు అరవింద పై కథలు అల్లేస్తున్నారు.
అరవింద సమేతలో ఎన్టీఆర్ కేరెక్టర్ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీగార్డ్‌గా కనిపించబోతున్నాడట. అది కూడా… అరవిందకి(హీరోయిన్ పూజా హెగ్డేకి)..... ఓ ప్రమాదం నుంచి కాపాడడం.. తనని రక్షించిన ఎన్టీఆర్‌ని తనతో పాటు రాయలసీమ తీసుకెళ్లడం… ఎన్టీఆర్ ధైర్యానికి మెచ్చి కథానాయిక ఇంట్లోవాళ్లు బాడీగార్డ్‌గా ఉండమనడం వంటి సీన్స్ అరవింద ప్రారంభ సన్నివేశాలుగా చెబుతున్నారు. మరోపక్క సునీల్ కేరెక్టర్ పై కూడా ఒక కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లు కలిసి ప్రతి ఛానల్ కి చాలా ఓపిగ్గా ఇంటర్వూస్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంటే. ఇప్పుడొచ్చిన సెన్సార్ టాక్ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్‌కే.. 40 కోట్లకు పైగా హారిక అండ్ హాసిని వారు వెనకేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది చాలు.. సినిమా మీద ఎంతగా అంచనాలున్నాయో అర్ధమవ్వడానికి కదా...!