తెలుగులో వరుసగా ‘ఛలో, గీతాగోవిందం, దేవదాస్’ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా కన్నడబ్యూటీ రష్మిక మందన్నా మారింది. ఇక ఈమెకి కన్నడలో అతి తక్కువ చిత్రాలతో వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రష్మిక ఇటీవల తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్దం క్యాన్సిల్ అయినప్పుడు కూడా ఎంతో ఎమోషనల్‌గా స్పందించింది. తాను ఎవ్వరినీ బాధ పెట్టాలని కూడా అనుకోనని, కానీ ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా తలో విధంగా తన గురించి మాట్లాడుతున్నారని దాదాపు ఏడ్చినంత పని చేసింది.
తాజాగా ఈమె తన మనస్తత్వాన్ని మరోసారి తెలిపింది. నా ముందు వారు ఎందుకు ముభావంగా ఉన్నా కూడా నా వల్లే అలా ఉన్నారని భావించి హైరానా పడిపోతాను. ఓసారి ‘గీతాగోవిందం’ సెట్స్‌కి వెళ్లడానికి కాస్త ఆలస్యం అయింది. కాస్త ఆలస్యంగా సెట్స్‌కి వెళ్లినప్పుడు ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకించినా యూనిట్‌లోని ఎవ్వరూ స్పందించలేదు. దీంతో నేను ఒక చోట కూర్చుని ఏడ్చేశాను. వెంటనే దర్శకుడు పరుశురాం పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నిన్ను ఆటపట్టించడానికే ఇలా చేశాం’ అని ఓదార్చారు. అప్పటివరకు నన్ను ఫాలో అవుతోన్న కెమెరాను ఆయన నాకు చూపించారు.
అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతోందనే విషయం అప్పటి వరకు నాకు తెలియదు. ఇక నాకు పుస్తకాలు పట్టుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. సినిమా పాటలు మాత్రం బాగా వింటాను.వంట చేయడం కూడా కొంచెం కొంచెం వచ్చు. ఇక కేక్స్ అయితే ఎంతో బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. కళాకారులు సున్నితమనస్కులై ఉంటారని అనేది రష్మిక మండన్నాను చూస్తే నిజమేనని ఎవరికైనా అర్ధమవుతుంది.