Advertisementt

ప్రభాస్ సినిమాకి ఇలాంటి టైటిలా..?

Tue 09th Oct 2018 03:27 PM
  ప్రభాస్ సినిమాకి ఇలాంటి టైటిలా..?
Prabhas, Radhakrishna movie Title Confirmed ప్రభాస్ సినిమాకి ఇలాంటి టైటిలా..?
Advertisement
Ads by CJ

జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని చేస్తున్నాడు. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగానే పట్టాలెక్కింది. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ ఇప్పుడు ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతుందనేది తెలిసిన విషయమే. ఇక ఇటలీ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటుగా పూజ హెగ్డే కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్‌ని పక్కన పెట్టి ప్రభాస్ ఈ సినిమాని మొదలు పెట్టాడు.

‘సాహో’ కూడా మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ప్రభాస్ - రాధాకృష్ణ మూవీని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం మలయాళ మూవీకి ఫ్రీమేక్ అనే న్యూస్ ప్రచారంలో ఉంది. 1990 లో వచ్చిన ఆ సినిమాకి ఈ సినిమా ఫ్రీమేక్ అంటున్నారు. ఇకపోతే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాకి ఒక టైటిల్ అనుకుంటున్నట్లుగా ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు వెరైటీగా ‘అమూర్‌’ అనే టైటిల్‌ ను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

మరి ‘అమూర్‌’ అనే పదం ఫ్రెంచ్ పదం. ‘అమూర్‌’ పదానికి ఫ్రెంచ్‌ లో ‘ప్రేమ’ అని మీనింగ్ వస్తోంది. అందుకే ప్రభాస్ 20 వ చిత్రానికి ఆ టైటిల్ నే సెట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ తో పాటు ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ ని కూడా పరుగెత్తిస్తాడని.. ఇక ‘సాహో’, ప్రభాస్ 20 కూడా 2019 చివరినాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని చెబుతున్నారు.

Prabhas, Radhakrishna movie Title Confirmed:

Amur is the Prabhas, Radhakrishna movie Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ