Advertisementt

అరెరె.. సమంతకు పెద్ద చిక్కొచ్చిపడిందిగా!

Sun 07th Oct 2018 11:30 AM
samantha,u turn,failed  అరెరె.. సమంతకు పెద్ద చిక్కొచ్చిపడిందిగా!
Samantha Failed with U Turn అరెరె.. సమంతకు పెద్ద చిక్కొచ్చిపడిందిగా!
Advertisement

తమిళంలో స్టార్ హీరోలతోనూ, కుర్ర హీరోలతోనూ జోడి కడుతూ.. మంచి స్క్రిప్ట్ వస్తే లేడి ఓరియంటెడ్ చిత్రాలతో చెలరేగి పోయి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొట్టగల శక్తి కేవలం ఒక్క నయనతారకే ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు నయనతారకున్న ఫాలోయింగ్ తర్వాతే ఏ హీరోయిన్ అనే రేంజ్ లో నయనతార ఉంటుంది. ఇక తెలుగులో అలా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో అనుష్క శెట్టి ముందుంటుంది. అరుంధతి కానివ్వండి, రాణి రుద్రమదేవి కానివ్వండి.. నిన్నగాక మొన్నొచ్చిన భాగమతి కానివ్వండి. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు అనుష్క పర్ఫెక్ట్ అనే రేంజ్ లో ఆమె సినిమాల కలెక్షన్స్ కూడా ఉంటాయి.

కానీ వారిలా స్టార్ హీరోయిన్ అయిన సమంత లేడి ఓరియంటెడ్ చిత్రంతో విజయం సాధించలేక చతికిల పడింది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలతో హిట్స్ కొట్టిన సమంత... తనకెంతో ఇష్టమైన యు టర్న్ సినిమాని తెలుగులో రీమేక్ చేసింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ గా సమంత నటన ఆసాంతం అద్భుతం. పవన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యు-టర్న్ కి సూపర్ హిట్ టాకోచ్చింది . సినిమా కూడా హిట్. సమంత హాట్ హాట్ గా డాన్స్ స్టెప్స్ తో అలరించింది కూడా. సినిమా సూపర్ హిట్ కానీ కలెక్షన్స్ నిల్. మరి సమంతకి ఈ లేడి ఓరియంటెడ్ పాత్రలు కలిసి రావా.. ఆమె కేవలం స్టార్ హీరోల పక్కన మాత్రమే నటిస్తే క్రేజ్ ఉంటుందా.. సోలోగా క్రేజ్ లేదా అంటూ సోషల్ మీడియాలో సమంతపై కామెంట్స్ పడుతున్నాయి.

ఎందుకంటే సమంత క్రేజ్ ని చూసే యు టర్న్ కి మంచి బిజినెస్ జరిగింది. తీరా చూస్తే యుటర్న్ క్లోజింగ్ కలెక్షన్స్ తో యుటర్న్ డిజాస్టర్ లిస్ట్ లో కెళ్ళింది.  మరి దీన్నిబట్టి సమంత క్రేజ్ యుటర్న్ కి సరిపోలేదు కనకే.. సినిమా కలెక్షన్స్ అలా ఉన్నాయంటున్నారు. అయితే యుటర్న్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు... అందుకే ఫలితంగా నష్టాలు వచ్చాయి. కాబట్టే ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలపై సమంత ఆసక్తి చూపకపోవచ్చనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలంటే ఇలా లేడి ఓరియంటెడ్ చిత్రాలైతేనే కరెక్ట్. కానీ సమంత కున్న స్టామినా వాటికీ సరిపోవడం లేదే. 

Samantha Failed with U Turn:

Big Problem to Akkineni Samantha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement