ఆమె షారుఖ్‌ఖాన్‌తో నటించిన మొదటి చిత్రమే సంచలనాలకు కారణం అయింది. అదే 'బాజీఘర్'. ఈ కర్ణాటకకి చెందిన మంగుళూరు బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీలలో కలిపి 40పైగా చిత్రాలలో నటించింది. వెంకటేష్-రాఘవేంద్రరావుల దర్శతక్వంలో వచ్చిన 'సాహసవీరుడు-సాగరకన్య', బాలకృష్ణతో 'భలే వాడివి బాసూ', నాగార్జునతో 'ఆజాద్', మోహన్‌బాబుతో 'వీడెవడండీ బాబు' చిత్రాల ద్వారా ఈ పొడుగు కాళ్ల సుందరి తెలుగువారి మనసును కూడా దోచుకుంది. ఈమె తాను సాధారణ టీనేజ్ యువతినేనని తన యవ్వనంలో జరిగిన సినిమా స్టోరీని పోలి ఉండే హార్ట్ బ్రేకింగ్ న్యూస్‌ని అభిమానులతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ, 'నా స్నేహితులు ఒక అబ్బాయితో బెట్ కట్టారు. నన్ను ఎలాగైనా ప్రేమలో దింపాలనేది ఆ బెట్. ఇది అచ్చం సినిమా స్టోరీలాగే ఉంది కదా..! అయినా ఇది నిజం. ఆ అబ్బాయి రోజు మా ఇంటికి ఫోన్ చేసేవాడు. అప్పుడు నేను కాలేజీ స్టూడెంట్‌ని. ఆ వయసులో ఏ అమ్మాయి మాత్రం అబ్బాయిలను చూసి ఆకర్షితులు కారో మీరే చెప్పండి. నేనూ అంతే. నాడు మాకు ల్యాండ్‌లైన్ ఫోన్ మాత్రమే ఉండేది. అతని ఫోన్ కోసం రోజూ సాయంత్రాలు ఎంతో ఎదురుచూసేదానిని. మానాన్న ఇంటికి వస్తే ఫోన్ కట్ చేసేదానిని. కానీ ఆ అబ్బాయి కనీసం తన పేరు కూడా చెప్పలేదు. అలా మూడు నాలుగు నెలలు మా డేటింగ్ నడిచింది. ఓ రోజు బస్టాప్‌లో కలుద్దాం అన్నాడు కానీ రాలేదు. ఆ సమయంలోనే నేను బ్రేకప్ చెప్పాలని అనుకున్నాను.
కానీ కేవలం బెట్‌లో నెగ్గడం కోసమే అతను నాతో రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేశాడని తెలిసింది. ఆ అబ్బాయి నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణని మాటల్లో చెప్పలేను. దానిని వర్ణించడం కూడా వీలుకాదు. కానీ నా హృదయం ఆ సంఘటనతో ముక్కలు ముక్కలైంది. చివరకు అంతా నా మంచికే జరిగింది. వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్నాను. రాజ్‌ని కలిసిన నాకు అంతా సంతోషమే దొరికింది. రాజ్ చాలా రొమాంటిక్ కూడా.. అంటూ చెప్పుకొచ్చింది. ఆ సంఘటనను కూడా ఆమె మరచిపోయి మరలా నటిగా, వ్యాపారవేత్త భార్యగా నిలిచిందంటే దానికి నాడు కృంగిపోకుండా ఈమె తట్టుకున్న గుండెస్తైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే మరి..!