Advertisementt

రష్మిక ఇంత తక్కువకే వచ్చేస్తుందా..?

Fri 05th Oct 2018 09:56 PM
rashmika mandanna,remuneration,movies  రష్మిక ఇంత తక్కువకే వచ్చేస్తుందా..?
Shocking Remuneration to Rashmika రష్మిక ఇంత తక్కువకే వచ్చేస్తుందా..?
Advertisement
Ads by CJ

నాగ శౌర్య 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో యూత్ మనసుల్ని గెలుచుకున్న ఈ అమ్మడు రెండో చిత్రం  'గీత గోవిందం'తో బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇక మూడో సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. నాగార్జున - నాని మల్టీస్టార్రర్ గా తెరకెక్కిన 'దేవదాస్' ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఇలా చేసిన మూడు సినిమాల్లో ఈమెకు మంచి పేరు రావడంతో వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫేమ్ కి తగట్టు పారితోషికాన్ని మాత్రం పెంచట్లేదట. చాలా కూల్ గా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుని తర్వాత మెల్లగా పారితోషికాన్ని పెంచాలని ఆలోచిస్తుందంట రష్మిక.

అలానే షో రూమ్ ఓపెనింగ్స్ కు గాను రష్మిక కేవలం 5లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందట. సాధారంగా అయితే ఏ హీరోయిన్ అయినా షో రూమ్ ఓపెన్ చేయాలంటే 10 లక్షలకి తక్కువ తీసుకోరు. కానీ రష్మిక రెమ్యూనరేషన్ ను తగ్గించి ఆఫర్లను చేజిక్కించుకోవాలనుకుంటుందట. తక్కువ తీసుకుంటే ఎక్కువ ఆఫర్స్ వస్తాయని భావిస్తుందో ఏంటో మరి.

Shocking Remuneration to Rashmika:

Rashmika Remuneration for Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ