శివబాలాజీ బిగ్‌బాస్ సీజన్1 విజేతగా నిలిచిన తర్వాత తానే నిర్మాతగా మారి రాజీవ్‌కనకాల, తాను హీరోలుగా నటిస్తూ ఓ చిత్రం తీస్తే అది తుస్సుమంది. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్2 విజేత కౌశల్ వంతు వచ్చింది. వాస్తవానికి కౌశల్ బాగానే ధనవంతుడు. బాలనటునిగా పరిచయం అవ్వడమే కాదు... ఎన్నో యాడ్స్‌ని తీసిన అనుభవం, మోడలింగ్ మేనేజిమెంట్ ఏజెన్సీని కూడా స్థాపించిన అనుభవం ఉంది. మరోవైపు మహేష్ తొలి చిత్రం ‘రాజకుమారుడు’తో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్‌ని, పలు టీవీ సీరియళ్లలో విలన్‌గా కూడా నటించాడు. ఇక బిగ్‌బాస్ విజేతగా మారిన తర్వాత అభిమానులు హీరోగా చూడాలని ఉంది అంటే తాను ఇకపై దర్శకుల కోసం ఎదురుచూస్తూ ఉంటానని, మంచి దర్శకుడు, కథ వస్తే తన తడాఖా చూపుతానన్నాడు.
ఇక ఈయనకు కూడా మంచి ఆర్దిక స్థోమత ఉండటం, దర్శకత్వ అనుభవం ఉన్న నేపధ్యంలో ఈయన వేరే దర్శకుడి కోసం చూస్తాడా? తానే హీరోగా, దర్శకనిర్మాతగా కూడా మారతాడా? అనే చర్చసాగుతోంది. ఇక బిగ్‌బాస్‌లో కౌశల్‌ని విజేతను చేయడంలో సక్సెస్ అయి ఏకంగా షోని, హోస్ట్‌ని, బిగ్‌బాస్‌ని కూడా కమాండ్ చేసిన కౌశల్ ఆర్మీలోని కొందరు క్రౌడ్ పుల్లింగ్ ద్వారా నిధులు సమకూర్చి కౌశల్‌ని సోలో హీరోగా పెట్టి తీసే చిత్రానికి నిర్మాతలుగా మారుతున్నారట.
ఈ పద్దతిలో ఇప్పటికే ‘పెసరట్టు, మను’ చిత్రాలు వచ్చాయి. మరికొన్ని కూడా రూపొందుతున్నాయి. ఇందులో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలలో వారు పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన షేర్ లభిస్తుంది. దాంతో కౌశల్ ఆర్మీ ఆయన్ను పెట్టి 4కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఇక బిగ్‌బాస్ ద్వారా కనివినీ ఎరుగని క్రేజ్ అందుకున్న కౌశల్‌కి సినిమాలో సోలో హీరోగా అచ్చి వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది!