Advertisementt

ఈ హెచ్చరికలకు ఆ డైలాగ్సే కారణమా?

Fri 05th Oct 2018 01:13 PM
mani ratnam,office,receive,bomb threat  ఈ హెచ్చరికలకు ఆ డైలాగ్సే కారణమా?
Mani Ratnam Receives Bomb Threat ఈ హెచ్చరికలకు ఆ డైలాగ్సే కారణమా?
Advertisement
Ads by CJ

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ది లెజెండ్‌ వంటి డైరెక్టర్‌ మణిరత్నం. ఆయన తన మార్కుని కోల్పోయాడని, నేటి ట్రెండ్‌కి, యువత పల్స్‌కి తగ్గట్లు తీయడంలో విఫలమవుతున్నాడనే విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ఈయన ఇటీవల కాలంలో తీసిన చిత్రాలలో ‘ఓకే బంగారం’ మాత్రమే మెప్పించింది. ఇక ఇటీవల వచ్చిన ‘చెలియా’ చిత్రం మణి దర్శకత్వ ప్రతిభపైనే సందేహాలు చెలరేగేలా చేసింది. నిజానికి మణి అంటే ఎంతో ఇష్టపడే వారు కూడా ఇలాంటి చిత్రాలు మణి నుంచి కలలో కూడా ఊహించలేకపోయారు. 

ఇక తాజాగా ఆయన తన ‘నవాబ్‌’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గాడ్‌ఫాదర్‌’ ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిన మరో మణి చిత్రం ఇది. మణి బ్రాండ్‌ మీద ఉన్న నమ్మకం, మంచి స్టార్‌ క్యాస్టింగ్‌ వల్ల దీనికి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. అయితే అన్నదమ్ముల ఆధిపత్య పోరుకి ఏదైనా బలమైన కారణం చూపి ఉంటే ఇది మరో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచేది. మణి మార్క్‌ కూడా సినిమాలో పెద్దగా కనిపించలేదు. కానీ ఈ చిత్రం తమిళనాటే కాదు.. టాలీవుడ్‌లో, ఓవర్‌సీస్‌లో కూడా తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో దీని కలెక్షన్లు ‘దేవదాసు’తో పోల్చుకుంటే ఎంతో స్టడీగా ఉన్నాయి. ప్రీమియర్లలో దేవదాస్‌దే పైచేయి అయినా తర్వాత మాత్రం ‘నవాబు’ పుంజుకుంది. 

ఇక ఇందులో జాలర్లు(మత్స్యకారులు, పట్టపువాళ్ల)ను కించపరిచేలా డైలాగ్స్‌ ఉన్నాయని ఆ కులం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఆఫీస్‌లో బాంబు పెట్టామని ఆయన ఆఫీసుకి కాల్‌ వచ్చిందట. పోలీసులు మొత్తం సోదాలు చేసినా బాంబు జాడ కనిపించకపోవడంతో ఇది ఫేక్‌ కాల్‌ అని తేల్చారు. అయితే ఫోన్‌ చేసిన వ్యక్తి కొన్ని డైలాగ్స్‌, సీన్స్‌ని తీసివేయమని బెదిరించాడు గానీ ఏ డైలాగ్‌లు, ఏ సీన్స్‌ అనేవి మాత్రం తెలపలేదని మణి ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌ 23న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాట 30కోట్లకు పైగా వసూలు చేస్తూ ఇంకా స్టడీగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం. 

Mani Ratnam Receives Bomb Threat:

Mani Ratnam office receives Bomb Threat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ