Advertisementt

నాని.. అంతలా అప్‌సెట్ అయ్యాడెందుకు?

Fri 05th Oct 2018 01:34 AM
  నాని.. అంతలా అప్‌సెట్ అయ్యాడెందుకు?
Nani Disappoints Bigg Boss 2 Host Job నాని.. అంతలా అప్‌సెట్ అయ్యాడెందుకు?
Advertisement
Ads by CJ

మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌2 ముగిసినా దానిపై వస్తున్న వార్తలు మాత్రం వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కౌశల్‌ ఆర్మీ చేత ట్రోలింగ్‌కి కారణమైన నాని బాగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆయన చివరి రోజు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాకు ఇదే చివరి రోజు. బిగ్‌బాస్‌ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు. హోస్ట్‌గా నన్ను ఆదరించిన వారికి కూడా కృతజ్ఞతలు. హోస్ట్‌గా నన్ను ఇష్టపడని వారిని థియేటర్లలలో చూద్దాం అని చెప్పాడు. 

ఇంకా ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్‌బాస్‌-2కి హోస్ట్‌గా వ్యవహరించడానికి ముందు నేను ఓ చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉంటూ వచ్చాను. ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది అనుకుంటూ గడిపాను. కానీ ఈ చిన్ని ప్రపంచంలో కూడా ఇన్ని రకాల మనుషులు ఉంటారనేది ఈ షో నాకు తెలిసేలా చేసింది. నిజమైన ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు తెలియజెప్పింది. ప్రపంచంలోని అందరినీ మనం మెప్పించలేమని, అలా ట్రై చేయడం కూడా వృధా అనేది తెలిసివచ్చింది. మనల్ని ఇష్టపడని వారు కూడా ఉంటారని, అలాంటి వారిని మనం ఏమీ చేయలేం. మారుద్దామని ప్రయత్నించడం కూడా సాధ్యం కాదని అనిపించింది. మరోవైపు బిగ్‌బాస్‌ షోకి నేను చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. దేవదాస్‌ షూటింగ్‌ కారణంగా రెండింటిని బ్యాలెన్స్‌ చేయలేక చాలా మానసిక క్షోభను అనుభవించాను అని చెప్పుకొచ్చాడు. 

మొత్తంగా కేవలం కౌశల్‌ ఆర్మీ వల్లనే నాని ఇంతలా అప్‌సెట్‌ అయ్యాడనేది వాస్తవమేనని అందరు అంటున్నారు. కేవలం మనది చిన్న ప్రపంచమేనని అందరు మనలా ఉంటారని భావించే ప్రేక్షకులకు కూడా ఇలాంటి షోలు వేర్వేరు విషయాలను తెలుసుకునేలా? మనుషులు, మనస్తత్వాలు ఇలాగా కూడా ఉంటాయా? అనేవి తెలపడం వల్లనే ఈ తరహా షోలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తుండటానికి కారణమనే చెప్పాలి. 

Nani Disappoints Bigg Boss 2 Host Job:

Nani Sensational Comments on Bigg boss 2 host

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ