వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లుగా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మిస్తున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం సుడిగాలి. ఈ చిత్రంలోని పాటలు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం ఎల్ సి రాములు నాయక్ బిగ్ సీడీని విడుదల చేయగా, నిర్మాత సాయి వెంకట్ సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిధులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. ట్రైలర్, పాటలు బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఈ మధ్య మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ఈ సుడిగాలి సూపర్ హిట్ కావాలని అన్నారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ.. రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలుస్తాయి. యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుంది. ముఖ్యంగా ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, కాబట్టి ఈ సినిమాకు విజయం గ్యారంటీ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ తో పాటు రీరికార్డింగ్ అద్భుతంగా అందించారు. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తిచేసాం .ఈ చిత్రంలో సుమన్ గారు అద్భుత మైన లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతము పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మా చిత్రం త్వరలోనే పూర్తి చేసి.. సినిమాను విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము .ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము..అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. హీరో హీరోయిన్ లు కొత్తవారు అయినా అద్భుతంగా నటించారు. అనుకున్న సమయములో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి నిర్మాతలు పూర్తి సహకారం అందించారు. ఈ చిత్రం ద్వారా నాకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ కథతో పాటు సాగుతాయి. ఇంతమంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.