Advertisementt

మరో నటీమణి పెళ్లి చేసుకోబోతోంది!

Thu 04th Oct 2018 03:02 PM
suja varunee,marriage,young actor,shivaji dev  మరో నటీమణి పెళ్లి చేసుకోబోతోంది!
Bigg Boss Suja Varunee Opens Up About Wedding మరో నటీమణి పెళ్లి చేసుకోబోతోంది!
Advertisement
Ads by CJ

తమిళం, కన్నడం, మలయాళంతో పాటు ‘గుండెల్లో గోదారి, నాగవల్లి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ’ వంటి చిత్రాలలో యాక్ట్‌ చేసిన నటి సుజావరుణి. ఈమె తెలుగులో కంటే తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె బిగ్‌బాస్‌ తమిళ సీజన్‌లో 1లో పాల్గొనడమే కాదు.. 2018 బిగ్‌బాస్‌2కి అతిధిగా కూడా వచ్చి మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. కోలీవుడ్‌లో వచ్చిన ‘మిలగా’ చిత్రం ఈమెకి మంచి పేరు తీసుకుని వచ్చింది. శివాజీ గణేషన్‌ మనవడు, రామ్‌కుమర్‌ కుమారుడై శివాజీ దేవ్‌తో ఆమె లవ్‌లో పడింది. శివాజీదేవ్‌ కూడా నటుడే అయినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

వీరి పరిచయం మొదట స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ఎప్పటి నుంచో హల్‌చల్‌ చేస్తున్నాయి. మొదట్లో ఈ ప్రచారాన్ని వారిద్దరు ఖండించారు. వారు తాము మంచి స్నేహితులం మాత్రమే అని వాదించారు. శివాజీదేవ్‌ ఇంటి పెద్దలు వ్యతిరేకించడమే దీనికి కారణమని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. తాజాగా వీరిద్దరు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. నిశ్చితార్ధం కూడా ఇటీవలే జరిగిందట.

నవంబర్‌ 19న వీరిద్దరు ఒకటి కాబోతున్నారు. దీనికి సుజా వరుణి కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు శివకుమార్‌ (పూర్తిపేరు శివాజీదేవ్‌ శివకుమార్‌)ని వివాహం చేసుకోనున్నట్లు శివకుమార్‌ని భర్తగా పొందటం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. మరి వీరి వివాహ వేడుక ఎక్కడో త్వరలో తెలుస్తుంది. 

Bigg Boss Suja Varunee Opens Up About Wedding:

BIGG BOSS Suja Varunee To Marry This Young Actor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ