మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న అరవింద సమేత - వీర రాఘవ హడావిడి స్టార్ట్ అయ్యిందిరోయ్... నిన్నమొన్నటి వరకు సినిమా షూటింగ్ జరుపుకున్న అరవింద సమేత ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలెట్టేసింది. భారీ అంచనాలున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమాని త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తొలి సినిమా. అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ చెప్పినట్టుగా గొప్ప దర్శకుడు - అద్భుతమైన నటుడు కలిస్తే ఎలా ఉంటుందో అరవింద సమేత - వీర రాఘవ ట్రైలర్ లో అర్ధమయ్యింది. అరవింద సమేత - వీర రాఘవ ట్రైలర్ అంచనాలు మరింతగా పెంచేసింది.
ఎన్టీఆర్ క్యూట్ లుక్స్, మాసివ్ లుక్స్ అదరగొడుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ సాఫ్ట్ వాయిస్ అండ్ మాస్ డైలాగ్స్ చెప్పే ఊర మాస్ వాయిస్ కూడా అదిరిపోయాయి. హీరోయిన్ పూజ హెగ్డే తో క్యూట్ క్యూట్ రొమాన్స్ చేసినా... శత్రువులను కత్తితో నరికినా ఎన్టీఆర్ కే చెల్లుద్ది అనేలా ఉంది అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్. పూజ హెగ్డే ఎన్టీఆర్ తో స్వీట్ గా సరసమాడడం.. ఫ్యాక్షనిజం గురించి ఎన్టీఆర్ తో చెబుతూ ఫ్యాక్షనిజం అంటే తెలుసా అని దిగి ఎన్టీఆర్ వైపు చూసి.. అర్ధం కాకపోతే అడుగు అలా క్యూట్ గా చూడకు అంటూ అందంగా చెప్పే డైలాగ్... ఎన్టీఆర్ శత్రువులను మట్టుబెట్టే టైంలో ఈడ మంది లేరా... కత్తుల్లేవా.. అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ అదుర్స్ అనేలా వున్నాయి. ఇక విలన్ గా జగపతి బాబు మాసివ్ ఎంట్రీ అదిరింది.
అలాగే పూజ హెగ్డే చెప్పే క్లాస్ డైలాగ్స్ తో పాటుగా.... ఎన్టీఆర్ నాన్నమ్మ చెప్పే మాస్ డైలాగ్ ని పర్ఫెక్ట్ ఫ్రేమ్ లో సెట్ చేశారు. ఎన్టీఆర్ కూడా వినే టైం.. చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది అని సునీల్ తో చెప్పే డైలాగ్ వుంది చూడండి.. త్రివిక్రమ్ రాసిన ఆ డైలాగ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలిందే. ఇక చివరిగా ఎన్టీఆర్.. రావు రమేష్ ముందు.. 100 అడుగుల్లో నీరు పడుతుంది అంటే.. 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారో.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి అంటూ చెప్పే డైలాగ్ కూడా చాలా అంటే చాలా బావుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ మేకింగ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, థమన్ అందించిన బీజీఎమ్, సినిమాటోగ్రఫీ అన్ని అరవింద సమేత - వీర రాఘవ మీద భారీ అంచనాలు పెంచేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్ మీదున్న అనుమానాలన్నీ అరవింద ట్రైలర్ తో పటాపంచలయ్యాయనడంతో అతిశయోక్తి లేదు.