Advertisementt

‘ప్రయత్నం’ అయితే చేశారు.. మిగతావి తర్వాత?

Tue 02nd Oct 2018 08:02 PM
dhanunjay,prayatnam,press meet,updates  ‘ప్రయత్నం’ అయితే చేశారు.. మిగతావి తర్వాత?
Prayatnam Movie Details ‘ప్రయత్నం’ అయితే చేశారు.. మిగతావి తర్వాత?
Advertisement
Ads by CJ

అభయ్ ప్రొడక్షన్ పతాకంపై విశాఖపట్నంలోని నూతన నటీనటులతో ధనుంజయ్, హ్రితిక సింగ్ హీరో హీరోయిన్ గా దినేష్ పి దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ప్రయత్నం'. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 

దీక్షిత్ గారు మాట్లాడుతూ... తన శిష్యుడైన ధనుంజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం మూవీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ రోజుల్లో సినిమా నిర్మాణం అంటే మాటలు కాదన్నారు. ఎన్నో కష్టనష్టాల్ని భరించి ఈ మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. ఈ సినిమాలో భాగం అయిన అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని అన్నారు.

హీరో మరియు నిర్మాత ధనుంజయ్ మాట్లాడుతూ... చిన్ననాటి నుండి సినిమాపై ఉండే ప్రేమతోనే ఈ మూవీ చేశానని అన్నారు. నటించాలనే కోరిక ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న వైజాగ్ ప్రాంత కళాకారులకు ఈ మూవీ ద్వారా అవకాశం కల్పించామని అన్నారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.

పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ... సినీ రంగంలో నిలదొక్కుకోవాలని చాలా మంది కలలు కంటారని అయితే ధనుంజయ్ అందరి కంటే భిన్నంగా ఆలోచించి ప్రయత్నం సినిమాతో వస్తున్నాడని అన్నారు. చిరు అభిమాని అయిన ధనుంజయ్ వైజాగ్ ప్రాంతంలో ఉన్న కళాకారుల్ని ప్రోత్సహించేందుకు చేసిన ఈ ప్రయత్నం మూవీ విజయం సాధించాలని ఆశీర్వదించారు. మూవీకి సంబంధించి ఏవైనా మెళకువలు కావాలంటే ఎప్పుడు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

హీరోయిన్ మాట్లాడుతూ... తెలుగులో మొదటిసారి నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. జాలారి ప్రాంత వాసిగా ఇందులో నటించడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ ద్వారా అందరికీ మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను.

Prayatnam Movie Details:

Prayatnam Movie Press Meet Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ