శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై చేసిన ఆరోపణలు, ఫిల్మ్‌చాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నటిగా కాకపోయినా ఏదో విధంగా సెలబ్రిటీగా మారింది. నేడు సినీ ప్రముఖులకే కాదు.. అందరికీ ఆమె అంటే తెలిసిపోయింది. కానీ ఆమె చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించినందుకు పవన్‌కళ్యాణ్‌పై కూడా తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఆమె దృష్టిలో అది కూడా తప్పేనట. వర్మ అండతో రెచ్చిపోయి ఇలా ప్రతి ఒక్కరిని బెదిరించడం సరికాదు. ఇక తనకు ఏకష్టం వచ్చినా, తనని చూసి నవ్వినా, మద్దతుగా నిలిచినా కూడా ఈమె ప్రతి దానికి కాస్టింగ్‌కౌచ్‌ని బూచిగా చూపి కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది. దీనికి ఓ చక్కని ఉదాహరణగా తాజా సంఘటన నిలిచింది.
ఈమె టాలీవుడ్ వారినే కాదు.. కోలీవుడ్‌కి చెందిన రాఘవలారెన్స్, మురుగదాస్ వంటి వారిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌లో తనకి భద్రతలేదని చెన్నై వెళ్లింది. ఇక ప్రస్తుతం ఆమె తన జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న‘రెడ్డి డైరీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా విశాల్, కీర్తిసురేష్ కలిసి నటించిన ‘సందెకోళి2’ వేడుకలో విశాల్ మాట్లాడుతూ శ్రీరెడ్డికి ఓ మంచి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆమెతో నటించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆమె కావాలని కెమెరాలు దాచుకుని వచ్చినా డేంజరే.. అని వ్యాఖ్యానించాడు. దీంతో వేదికపై ఉన్న అందరు నవ్వులు చిందించారు. కానీ అందరితో పాటు చిన్ననవ్వు నవ్విన కీర్తిసురేష్‌ని తాజాగా శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. విశాల్‌కి థ్యాంక్స్ చెబుతూ ఆమె ట్వీట్ చేసింది. ఇందులో కీర్తిసురేష్‌పై మండిపడింది.
మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్. మీరు ఎప్పుడు అగ్రస్థాయిలో ఉండలేరు. పోరాడే వారి బాధ ఏంటో మీకు ఒకరోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి.. మీనవ్వును నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నట్లు ఉన్నారు.. అంటూ వార్నింగ్ టైప్‌లో హెచ్చరికలు జారీ చేసింది. మరీ ఈమె మగాళ్లను సరే.. ఆడవారిని కూడా ఇలాగే బెదిరిస్తూ ఉండటం ఏమాత్రం సమంజసం కాదనే చెప్పాలి.