Advertisementt

తనుశ్రీ, నానా.. మద్ధతు ఎవరికి?!

Tue 02nd Oct 2018 10:56 AM
shilpa shetty,react,thanu sree,nana patekar,issue,bollywood  తనుశ్రీ, నానా.. మద్ధతు ఎవరికి?!
Shilpa Shetty Reacted on Thanu Sree Issue తనుశ్రీ, నానా.. మద్ధతు ఎవరికి?!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వీరభద్ర’ ఫేమ్‌ తనుశ్రీదత్తా ప్రకంపనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇండస్ట్రీ నిలువునా చీలిపోయింది. కొందరు బాలీవుడ్‌ మాత్రమే కాదు.. దేశం మొత్తం గర్వించే నటులు, రజనీకాంత్‌ సైతం నానా తర్వాతే ఎవరైనా అని గౌరవించే నానాపాటేకర్‌ మీద ఆమె ఆరోపణలు చేయడమే దీనికి కారణం. ఎన్నో సామాజిక సేవలు, వివాహం కూడా చేసుకోకుండా తాను సంపాదించినదంతా సమాజానికే ఖర్చుపెడుతున్న ఓ గొప్పనటుడు, పెద్దమనిషిపై ఈ ఆరోపణలు రావడమే దీనికి కారణం. అదే ఆమె వివేక్‌ అగ్నిహోత్రిపై ఆరోపణలు చేసినా నిజమని నమ్మిన వారికి నానా ఇలాంటి వాడా? అనేది నమ్మశక్యం కాకుండా ఉంది. 

ఇండస్ట్రీ నిలువునా చీలిపోయి కొందరు నానా వైపు, మరికొందరు తనుశ్రీ వైపు నిల్చున్నారు. అసలు ఈ చర్చ, రచ్చ వద్దు. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటానని నానా చెబుతున్నాడు. తనతోపాటు యూనిట్‌లో వందల మంది ఉండగా వారికి తెలియకుండా తానేమి చేస్తానని ఆయన అంటున్నాడు. మరికొందరు నానా అభిమానులు పదేళ్లుమౌనంగా ఉంది ఇప్పుడు విమర్శలు చేస్తే ఎలా? అంటున్నారు. తనుశ్రీ మద్దతుదారులు మాత్రం ఆడది ఎప్పుడు ఆరోపణలు చేసినా స్పందించాలి. 60ఏళ్ల తర్వాత చెప్పినా సంజాయిషీ ఇవ్వాలని అంటున్నారు. తనుశ్రీ ఏమో ఆ సమయంలో తాను నటిగా తొలి అడుగులు వేస్తున్నానని, ఈ విషయం చెబితే తన కెరీర్‌కి నాశనం జరుగుతుందని మౌనంగా ఉన్నానని అంటోంది. మరోవైపు ఆమె అప్పుడే మీడియా ముందుకు వచ్చినా నేటి ఆమె మద్దతు దారులు నాడెందుకు ఆమెని సమర్దించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. 

ఇక తాజాగా ఈ విషయంపై శిల్పాశెట్టి స్పందించింది. ఈ మేరకు ఆమె వీడియోలో మాట్లాడారు. ‘ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు. కానీ సెట్స్‌లో అలాంటి హింసకు తావు ఉండకూడదు. అక్కడ స్త్రీ, పురుషులపై ఎలాంటి ఒత్తిడి ఉండదనేది నా అభిప్రాయం. కానీ తనుశ్రీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఆమె ఎక్కడ ఇబ్బంది పడిందో నేను అర్థం చేసుకోగలను.. అని వ్యాఖ్యానించింది. నానా నోటీసులు పంపానని చెబుతుంటే, తనుశ్రీ మాత్రం ఇప్పటివరకు అవి తనకు అందలేదని చెబుతుండటం విశేషం. 

Shilpa Shetty Reacted on Thanu Sree Issue:

Bollywood Celebrities Support to Nana and Thanu Sree

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ