Advertisementt

స‌వ్య‌సాచి టీజ‌ర్: అద్భుతానికి ఆరంభం

Mon 01st Oct 2018 08:25 PM
savyasachi,teaser,naga chaitanya,chandoo mondeti  స‌వ్య‌సాచి టీజ‌ర్: అద్భుతానికి ఆరంభం
Savyasachi Teaser Released స‌వ్య‌సాచి టీజ‌ర్: అద్భుతానికి ఆరంభం
Advertisement
Ads by CJ

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్ఫూర్తితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనగా.. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్.  

ఈ టీజ‌ర్ చాలా రీ ఫ్రెషింగ్ గా అలాగే సృజ‌నాత్మ‌కంగా ఉంది. మామూలుగా ఒక త‌ల్లి ర‌క్తం పంచుకుని పుడితే అన్నాద‌మ్ములు అంటారు.. అదే ఒకే ర‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొద‌లుని.. క‌డ‌దాకా ఉండే క‌వచాన్ని.. ఈ స‌వ్య‌సాచిలో స‌గాన్ని అంటూ చైతూ టీజ‌ర్ లో చెప్పిన డైలాగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలో ఎప్పుడూ రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. విజువ‌ల్స్‌ను చాలా బాగా చూపించారు. స‌వ్య‌సాచి కొన్ని క‌ళ్లు చెదిరిపోయే లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. అవ‌న్నీ టీజ‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. మాధ‌వ‌న్, భూమికా చావ్లా ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మాధవన్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా టీజర్ లో చిన్న క్లూ ఇచ్చారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది.  

నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్ మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలోని తారాగణం. 

Click Here for Teaser

Savyasachi Teaser Released:

Savyasachi Teaser Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ