ఎనర్జిటిక్ హీరో రామ్.. ప్రేమించిన అబ్బాయిలకి ఓ మంచి సలహా ఇచ్చాడు. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఎలా ఒప్పించాలో ఓ ఐడియా ఇచ్చాడు. ‘వీడు పెళ్లి చేసుకుంటే చాలురా బాబూ’ అని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నా టైములో ఆ అమ్మాయని ఇంటికి తీసుకునివెళ్తే వెంటనే ఓకే చెప్పేస్తారు అని సలహా ఇచ్చాడు.
అయితే మరి రామ్ కూడా అదే విధంగా చేస్తాడో లేదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకూ ఏ అమ్మాయి నచ్చలేదని తెలిపాడు. తనకు ఎవరు నచ్చి కనెక్ట్ అయితే వెంటనే ఆ అమ్మాయిని ఓ అర్ధరాత్రి రామ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని మీడియాకు ఫోన్ రావొచ్చని రామ్ తెలిపాడు. అయితే ‘పండగ చేసుకో’ మూవీ టైములో తనకు, రకుల్ కి ఎంగేజ్‌మెంట్ అయిందని వచ్చిన వార్తలు రామ్ ఖండించాడు. అయితే ఆ రూమర్ నా వరకు రాలేదని రామ్ తెలిపాడు.
నామీద అసలు పుకారులు రావని.. ఇప్పటివరకు రాలేదని చెప్పాడు. ఏమైనా రూమర్స్ వచ్చినా.. అవి మా అన్నయ్య, లేదా స్నేహితులు చెబుతుంటారు. అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు.. ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి? అని ఆట పట్టిస్తుంటారు’ అని రామ్ అన్నాడు. రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా వచ్చే నెల 18న విడుదల అవుతుంది. ఈ సినిమాపై రామ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు.