చారిత్రక చిత్రాలు అంటే దాదాపు నాటి వ్యక్తుల బయోపిక్స్ వంటివి. సినిమాలో కావాలంటే సినిమా టిక్ పాటలు, ఫైట్స్ వంటివి చూపిస్తే పోనిలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ వాస్తవానికి జరిగింది వేరైతే చూపించేది మరో విధంగా ఉంటే ఎలా? అలా ఇష్టం వచ్చినట్లు మార్చుకోవాలంటే ‘బాహుబలి’ వంటి చారిత్రక వాసనలు ఉండే కల్పిత కథను తయారు చేసుకోవడం సమంజసం. విషయానికి వస్తే సూపర్‌స్టార్ కృష్ణ తన జీవితంలో ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్‌లో నటించాలని భావించాడు. కానీ శివాజీ పోరాటం అంతా మన దేశంలో దాడెత్తిన ముస్లిం ముష్కరరాజుల పోరాటంతోనే ముడిపడి ఉంటుంది. తనకు చూస్తే ముస్లిం అభిమానులు ఎక్కువ. కాబట్టి ఉన్నది ఉన్నట్లు తీస్తే ముస్లింలు హర్ట్ అవుతారని ఆయన ఆ ప్రాజెక్ట్‌నే ఆపేశాడు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు తొలి స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని మెగాస్టార్ చిరంజీవి ‘సై..రా’ చిత్రంగా తీస్తున్నాడు. అసలు ఉయ్యాలవాడ స్వాతంత్య్రసమరయోధుడు కాదని, ఆయన ఓ దోపీడీదొంగ అని వాదించే వారు కూడా ఉన్నారు. ఇక ఉయ్యాలవాడ జీవితంలో ఏమిజరిగిందంటే చివరలో ఉయ్యాలవాడని తలని నరికి చంపిన ఆంగ్లేయులు ఆయన తలను కోట గుమ్మం ముందు వేలాడదీశారు. తిరుగుబాటుదారులకు భయం పుట్టించేందుకు వారు ఆ పని చేశారు. కానీ చిరు వంటి యోధుడి తలని అలా నరికి గుమ్మం ముందు వేలాడదీస్తే అభిమానులుహర్ట్ అవుతారని భావించిన చిత్ర యూనిట్ ఆ సీన్ చూపించకుండా, ఉయ్యాలవాడ స్ఫూర్తితో మరికొందరు విప్లవవీరులుగా మారి ఆంగ్లేయులపై తిరుగుబాబు చేశారనే పాయింట్‌ని హైలైట్ చేస్తూ క్లైమాక్స్‌ని మార్చారట.
మరి ఇదే నిజమేతే చరిత్రను మార్చడం తప్పు. మరి ఇది నిజమైన వార్తేనా? కాదా? అనేది సినిమా విడుదలైతే గానీ చెప్పలేం. ప్రస్తుతం ఈ చిత్రంలోని వీరోచిత యుద్ద సన్నివేశాలను జార్జియాలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ‘సై..రా’ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.