ప్రకాష్‌రాజ్.. ఈయన గొప్పనటుడే కావచ్చు. కానీ నిర్మాతలను, దర్శకులను బాగా ఇబ్బంది పెడతాడని, షూటింగ్‌లకు సమయానికి రాడని, కోపం వస్తే యూనిట్ వారిపై చేయి చేసుకుంటాడని ఎన్నో విమర్శలు ఉన్నాయి. కానీ దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే.. మరీ ఇన్ని తప్పులు నావైపు ఉంటే నన్ను ఏరికోరి ఎందుకు ఎక్కువ చిత్రాలలో పెట్టుకుంటున్నారు? ఇంత లాంగ్ కెరీర్ నాకు ఎలా సాధ్యమైంది? అని అంటాడు. కానీ ఆయన హవా సాగుతోంది.. మంచి నటుడు కావడం వల్లే చాన్స్‌లు వస్తున్నాయని అంతేగానీ ఆయన వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని అర్ధమవుతోంది. ఇక ఈయన నటీమణుల పట్ల కూడా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తాడని అంటారు.
కాస్టింగ్‌కౌచ్ అనేది అన్ని రంగాలలో, అన్ని భాషల పరిశ్రమలో ఉంది. కానీ మన హీరోయిన్లు కాస్టింగ్‌కౌచ్‌పై ఆరోపణలు చేసినప్పుడు పెద్దగా స్పందించని ఈయన తాజాగా తనుశ్రీదత్తా బాలీవుడ్‌లో నానాపాటేకర్ వంటి నటునిపై చేసిన ఆరోపణలపై మాత్రం స్పందించాడు. బాలీవుడ్ నటీమణులపై జరుగుతున్న వేధింపులపై మాట్లాకపోతే చరిత్ర క్షమించదని పెద్దపెద్ద పదాలే వాడాడు. బిగ్‌బి అమితాబ్ దీనిపై స్పందించకపోవడం, నానాపాటేకర్ కూడా తాను ఏమీ మాట్లాడనని ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించినా ప్రకాష్‌రాజ్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ మాట్లాడాడు.
ఆయన మాట్లాడుతూ.. ఓ నటునిగా నాకు అనిపించింది నేను వ్యక్తపరుస్తాను. ఈమధ్యకాలంలో ప్రజలు అధికారం చెలాయించాలని చూస్తున్నారు. దీని వల్ల ఇతరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పౌరుడిగా ఇవ్వన్నీ నన్ను బాగా కలవరపరుస్తున్నాయి. నాకు నచ్చినట్లు నేనుంటాను. భయపడని పౌరుడిగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాలీవుడ్ నటీమణులపై జరుగుతున్న అన్యాయాలపై కొందరు స్పందించకుండా మౌనంగా ఉంటున్నారంటే అందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. వారి నిస్సహాయతను నేను అర్ధం చేసుకోగలను. ఏం మాట్లాడితే ఏమి జరుగుతుందో అనేద వారి భయమై ఉండవచ్చు. అలాంటి వారిని చరిత్ర క్షమించదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు మాట్లాడితే ఇంతకు ముందు ఎందుకు స్పందించలేదు? అని సమాజం వారిని ప్రశ్నిస్తుంది. నేను కేవలం బాలీవుడ్‌లో ఏర్పడిన పరిస్థితులపైనే మాట్లాడటం లేదు.
నా స్నేహితురాలైన గౌరీలంకేష్ గురించి మాట్లాడుతున్నాను. ఆమె హత్య నన్ను బాగాడిస్ట్రర్బ్ చేసింది. 35ఏళ్ల స్నేహం మాది. గౌరీ తండ్రి మా మెంటార్. ఆమె హత్య గురించినేను మాట్లాడినప్పుడు అందరు నన్ను నిందించారు. నన్ను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులు కూడా ఎందరో ఉన్నారు. వారిపై నా ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచించాను. ఆ తర్వాత నా అభిప్రాయం చెప్పినంత మాత్రాన తప్పులేదనిపింది.. అని చెప్పుకొచ్చాడు. ప్రకాష్‌రాజ్ మాటలు వింటే ఇవి నానాపాటేకర్‌ని, బిగ్‌బి అమితాబ్‌ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తున్నాయి.