ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న అరవింద సమేత -వీర రాఘవ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే ఒక పాట చిత్రీకరణ కోసం అరవింద సమేత యూనిట్ ఇటలీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన వెంటనే హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ ఇతర ప్రధాన తారాగణంపై కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో సినిమాలో చాల కీలకమైన పెనివిటి… పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుందని... ఇక గుమ్మడికాయ కొట్టడమే తరువాయి అంటున్నారు.
అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎప్పటిలాగే హీరో కోసం ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. పూజా హెగ్డే లీడ్ రోల్ అంటే టైటిల్ అరవింద రోల్ ప్లే చేస్తుండగా...మరో హీరోయిన్ ఇషా రెబ్బ ఎన్టీఆర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మొదట్లో ఒక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని.. మీనా, రంభ పేర్లు వినబడినా చివరికి ఆ సీనియర్ హీరోయిన్ కేరెక్టర్ ఎవరు చేస్తున్నారూ.. అసలా కేరక్టర్ ఉందో లేదో అనే క్లారిటీ కూడా లేదు. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కాదు ముగ్గురు హీరోయిన్స్ అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినబడుతుంది.
కన్నడ భామ మేఘశ్రీ కూడా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోందని.. అరవింద సమేత లో మేఘశ్రీ ఒక కీలక పాత్రలో నటించబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మరి మేఘశ్రీ ఎన్టీఆర్ తో ఎలాంటి రొమాన్స్ చేస్తుందో గాని.. ముగ్గురు హీరోయిన్స్ తో ఎన్టీఆర్ మాత్రం ఈలేస్తూ ఎంజాయ్ చేస్తాడంటూ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం తెగ ఇదై పోతున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకాబోతున్న అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైద్రబాద్ లో గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ రెండున గ్రాండ్ గా చేయాలని మేకర్స్ నిర్ణయించారు.