విజయ్ దేవరకొండ ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ లో సందడి చేసాడు. ఇప్పుడు ఆయన తమిళనాట కూడా అడుగు పెడుతున్నాడు. ఆయన నోటా సినిమా ప్రమోషన్ కోసం తమిళ బిగ్ బాస్ షోకు వెళ్లాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడ ఈ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్కడ స్టేజ్ పై తన సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం తొలిసారి విజయ్ దేవరకొండకే దక్కింది. అక్టోబర్ 5న విడుదల కానున్న నోటా సినిమాను తమిళ్ బిగ్ బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ హీరో. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మించారు.