నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా సవ్యసాచి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఈ చిత్ర టీజర్ అక్టోబర్ 1 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. నాగచైతన్య ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందూ. భారతంలో అర్జునుడికి ఉన్నట్లే.. సవ్యసాచిలో హీరోకు కూడా రెండు చేతులకు సమానమైన బలం ఉంటుంది. అందుకే సవ్యసాచి టైటిల్ పెట్టారు. ఈ చిత్రంతోనే మాధవన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరకూరి(సివిఎం) నిర్మిస్తున్నారు. నవంబర్ లో సవ్యసాచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్ మాధవన్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు: కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు: చందూ మొండేటి, నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ వై, మోహన్ చెరుకూరి(సివిఎం), సహ నిర్మాత: ప‌్రవీణ్ ఎం, లైన్ ప్రొడ్యూసర్: పిటి గిరిధర్ రావు, కో డైరెక్టర్: చలసాని రామారావు, సిఈఓ: చిరంజీవి(చెర్రీ), సంగీతం: ఎంఎం కీరవాణి, ఆర్ట్: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: యువరాజ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పిఆర్ఓ: వంశీ శేఖర్