ఇటీవలే కేరళకి చెందిన క్రైస్తవ సన్యాసిని బిషప్ రేప్ విషయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి ట్విట్టర్ నిర్వాహకుల నుంచి వార్నింగ్ అందుకున్న వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈయన నిజానికి ఓ సంఘసంస్కర్త, వామపక్ష భావాలకు వ్యతిరేకంగా పలు పుస్తకాలు, ఎన్జీవో సంస్థలను నడుపుతున్నాడు. ఎన్నో సంస్కృత పురాణాలు, వేదాలు క్షుణ్ణంగా చదివాడు. థ్రిల్లర్స్, స్పోర్ట్స్, రాజకీయం, నాటకం, శృంగార సాహిత్యంపై కూడా సినిమాలు తీశాడు. మంచి ప్రసంగీకుడు, రచయిత కూడా. తన భార్య, నటి పల్లవి జోషితో కలిసి ఎన్జీవో సంస్థ అయిన ఎన్‌ఐఎం బుద్దని నడుపుతున్నాడు. 'చాక్లొట్, ధన్‌ధన్‌గోల్, హేట్‌స్టోరీ, జిద్, ట్రాఫిక్ జామ్లే బుద్దుడు, జునీనియత్' వంటి చిత్రాలను తీశాడు.
ఇక విషయానికి వస్తే నానాపాటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కలిసి తనని లైంగికంగా వేధించారని బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా సెట్‌లో వారు వేధించారని మీడియా ముందుకు వచ్చింది. తాజాగా తనుశ్రీ మరో సంచలన విషయం ప్రకటించింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. చాక్‌లేట్, డీప్ డార్క్ సీక్రెట్స్ షూటింగ్ సమయంలో ఓ పాటలో దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా వివేక్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ తనని కాపాడారని తెలిపింది.
ఈ సందర్భంగా వారిద్దరిపై కూడా వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశాడని పేర్కొంది. మరోవైపు బాలీవుడ్‌లో తనుశ్రీకి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే తనుశ్రీకి ఫర్హాన్‌అక్తర్, ప్రియాంకాచోప్రా, రిచ్చాచద్దా, ట్వింకిల్‌ఖన్నా మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో సునీల్‌శెట్టి, ఇర్ఫాన్ ఖాన్‌లు నోరు విప్పందే తప్పు ఎవరిదనేది తేలదు.